పోలీస్ వెబ్సైట్ హ్యాక్..
విశాఖపట్నం నగర ట్రాఫిక్ పోలీస్ అధికారిక వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురైంది. దాదాపు మూడు గంటలపాటు హ్యాకర్ల ఆధీనంలోనే ఉండిపోయిన సైట్ ను పోలీసులు ఎట్టకేలకు పునరుద్ధరించగలిగారు. నగరంలోని ట్రాఫిక్ ప్రభావిత ప్రాంతాలు, ట్రాఫిక్ నియమాలు, చట్టాలు, వాహనదారులకు నిర్వహిస్తున్న ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాల వివరాలు, ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఫోన్ నంబర్లతో పాటు నిషిద్ధ ప్రాంతాల వివరాలతో కూడిన రూట్ మ్యాప్‌ను పొందుపరుస్తూ ఏడాది క్రితం వైజాగ్ పోలీస్ డాట్ కామ్ వెబ్ సైట్ ను రూపొందించారు.
గత ఆదివారం మధ్యాహ్నం వెస్‌సైట్‌పై హ్యాకర్లు దాడిచేశారని తెలుసుకున్న తెలుసుకున్న పోలీసు అధికారులు హుటాహుటిన సైబర్ వింగ్‌తో కలిసి వెబ్‌సైట్‌ను హ్యాకర్ల బారినుంచి కాపాడుకున్నారు. అప్పటికే వెబ్‌సైట్‌లో హ్యాకర్లు పాకిస్థాన్ జాతీయ జెండాను పోస్ట్ చేసినట్లు తెలిసింది. విషయం బయటలకు తెలిస్తే పరువు పోతుందని భయపడిన అధికారులు ఈ విషయాన్ని గుట్టుగా ఉంచారు. కానీ, ఎలాగోలా బడటికి పొక్కింది. వెబ్ సైట్ హ్యాక్ అయింది నిజమేనని విశాఖ ట్రాఫిక్ ఏడీసీపీ అంగీకరించారు.
మూడు రోజుల క్రితం మూడు గంటల పాటు హ్యాకర్ల ఆధీనంలో ఉందని, ఆ సమయంలో మానిటర్లపై 'దిస్‌సైట్ హ్యాక్' అనే మెసేజ్ ప్యానెల్ మాత్రమే కనిపించిందని, హ్యాకర్ల వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని ఏడీసీపీ కె. మహేంద్రపాత్రుడు చెప్పారు. దీనిపై విచారణ ప్రారంభించిన పోలీసులు.. హ్యాకర్లు టర్కీ దేశస్ధులని, ఆ దేశం నుంచే హ్యాకింగ్‌కు పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. హ్యాకర్లు ట్రాఫిక్ వెబ్‌సైట్‌ను టార్గెట్ చేయడం వెనుక కారణాలను కూడా లోతుగా అధ్యయనం చేస్తున్నారు. సీఎంతో సహా ప్రముఖులు నగరానికి ఎక్కువగా వస్తున్నందున ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న వారెవరైనా వారికి హాని తలపెట్టడం కోసం చేసే ప్రయత్నాలో భాగంగా ట్రాఫిక్ సమాచారం.