ఢాకా: బంగ్లాదేశ్ లో మైనారిటీలకు రక్షణ కరువవుతోంది. ఇటీవల ఆ దేశంలో ఓ హిందువును నడిరోడ్డుపై దారుణంగా హతమార్చిన ఘటన మరువక మరో దారుణం చోటు చేసుకుంది. బందర్బన్ జిల్లాలో 75 ఏళ్ల బౌద్ధ సన్యాసిని కిరాతకంగా నరికి చంపారు. సమీప ఆలయం మాంగ్ షూ అనే బౌద్ధ సన్యాని మృతదేహం రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు బందర్బన్ డిప్యూటీ పోలీస్ చీఫ్ జైషీముద్ధీన్ తెలిపారు. కాగా బంగ్లాదేశ్లో ఇస్లామిక్ ఉగ్రవాదులు రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఓ బ్లాగర్, ఇంగ్లిష్ ప్రొఫెసర్ను వీరు హతమార్చిన విషయం తెలిసిందే.