Buddhist monk
-
నేటి సిద్ధార్థుడు!
రాబిన్ శర్మ బెస్ట్ సెల్లర్ ‘ది మాంక్ హూ సోల్డ్ హిజ్ ఫెరారీ’నవలలో కథా నాయకుడు జూలియన్ మాంటిల్ తిరుగులేని క్రిమినల్ లాయర్. తృప్తిలేని తన జీవన విధానంతో విసిగి అపారమైన ఆస్తులన్నింటినీ అమ్మేసి తనను తాను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాడు. మలేషియాకు చెందిన వెన్ అజాన్ సిరిపన్నోదీ అలాంటి కథే. ఏకంగా 500 కోట్ల డాలర్ల వ్యాపార సామ్రాజ్యాన్ని తృణప్రాయంగా వదులుకుని మరీ బౌద్ధ భిక్షువుగా మారిపోయాడు. ఆయన తండ్రి ఆనంద కృష్ణన్ అలియాస్ ఏకే మలేషియాలో మూడో అత్యంత ధనవంతుడు. ఆయన ఆస్తి రూ.42,000 కోట్ల పైమాటే. టెలికాం, శాటిలైట్స్, మీడియా, ఆయిల్, గ్యాస్, రియల్ ఎస్టేట్ రంగాల్లో విస్తరించిన వ్యాపార సామ్రాజ్యం ఆయనది. అలాంటి ఏకేకు సిరిపన్నో ఏకైక కుమారుడు. అంతటి ఆస్తినీ వద్దనుకుని బుద్ధం శరణం గచ్ఛామి అన్నాడు. బౌద్ధ భిక్షువుగా మారిపోయాడు. బౌద్ధాన్ని నమ్మే తండ్రి కృష్ణన్ కూడా ఈ నిర్ణయాన్ని గౌరవించడం విశేషం. ఇదంతా జరిగి 20 ఏళ్లయింది. నాటినుంచీ సిరిపన్నో దాదాపుగా అడవుల్లోనే గడుపుతున్నారు. థాయ్‌లాండ్–మయన్మార్ సరిహద్దులో తావో దమ్ బౌద్ధారామంలో అబాట్ (ప్రధాన సన్యాసి)గా ఉన్నారు. పూర్తిగా భిక్ష మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఎప్పుడో ఓసారి తండ్రిని చూడటానికి వచ్చిపోతుంటారు. మార్చింది ఆ ప్రయాణమే సిరిపన్నో జీవితంలోనే భిన్న సంస్కృతులున్నాయి. ఆయన తల్లి మోమ్వాజరోంగ్సే సుప్రిందా చక్రబన్ థాయ్ రాజ కుటుంబీకురాలు. ఆయన తన ఇద్దరు సోదరీమణులతో కలిసి లండన్‌లో పెరిగారు. అక్కడే చదువు పూర్తి చేశారు. ఇంగ్లిష్తో పాటు ఏకంగా ఎనిమిది భాషలు మాట్లాడగలరు. 18 ఏళ్ల వయసులో తల్లితో కలిసి థాయ్‌లాండ్ వెళ్లారు. సరదాగా ఓ బౌద్ధారామానికి రిట్రీట్‌కు వెళ్లారు. అక్కడే ఆయనను బౌద్ధం ఆకర్షించింది. అది బలపడి, చూస్తుండగానే జీవన విధానంగా మారిపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
షాకింగ్: 150మంది సాధువులకు కరోనా
ధర్మశాల: హిమాచల్ ప్రదేశ్ కంగ్రా జిల్లా జోన్‌గ్యూటో బౌద్ధ ఆశ్రమంలో 150 మంది సాధువులకు కరోనా సోకింది. ఫిబ్రవరి 18వ తేదీన టిబెటన్ కొత్త సంవత్సరం సందర్భంగా బౌద్ధ ఆశ్రమంలో వేడుకలు జరిగాయి. ఈ క్రమంలో బౌద్ధ ఆశ్రమంలో 20 మందికి కరోనా సోకడంతో అప్రమత్తమైన వైద్యాధికారులు 330 మంది సాధువులకు కరోనా పరీక్షలు చేశారు. వారిలో 154 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. 8 రోజుల్లోనే 154 మందికి కరోనా సోకడంతో గ్యూటో ఆశ్రమాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. ఈ ఆశ్రమానికి కర్ణాటక, ఢిల్లీ ప్రాంతాల నుంచి ఫిబ్రవరి 23వ తేదీన 15 మంది బౌద్ధ భిక్షువులు వచ్చారు. కరోనా వచ్చిన సాధువుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించలేదని, ప్రయాణాలు చేసి వచ్చిన వారిని ఆశ్రమంలోనే క్వారంటైన్ చేశామని కంగ్రా జిల్లా కలెక్టరు రాకేష్ ప్రజాపతి చెప్పారు. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే బయట ప్రాంతాల నుంచి వచ్చిన సాధువులకు కరోనా నెగిటివ్ అని తేలింది. కానీ ఇందులో ఒకరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనని తాండ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించామని కలెక్టర్ వివరించారు. ధర్మశాలలోని కరోనా ప్రబలిన బౌధ్ధ ఆశ్రమానికి సీలు వేశామని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ చెప్పారు. బౌద్ధ ఆశ్రమంలో 60 ఏళ్లు పైబడిన వారికి కరోనా టీకాలు వేశామని అధికారులు చెప్పారు. చదవండి: కరోనాతో కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత -
వైరల్: పాములకు ఆశ్రయం కల్పిస్తోన్న బౌద్ధ సన్యాసి
వన్యప్రాణులను అక్రమంగా విక్రయించడంలో మయన్మార్ ప్రపంచంలోనే కేంద్ర బిందువుగా మారింది. స్థానికంగా ఉండే పాములను పట్టుకొని తరచుగా పొరుగు దేశాలైన చైనా, థాయ్‌లాండ్‌కు అక్రమంగా రవాణా చేస్తుంటారు. ఈ నేపథ్యంలో మయన్మార్‌లోని యాంగోన్లో ఓ బౌద్ధ సన్యాసి వివిధ రకాల పాములకు ఆశ్రయం కల్పించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు ఓ ఆశ్రమాన్ని ఎంచుకొని కొన్ని వేల జాతుల పాములకు అక్కడ రక్షణ కల్పిస్తున్నారు. ఈ క్రమంలో పాములతో బౌద్ధ సన్యాసి దిగిన ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. విలాతా(69) అనే బౌద్ధ సన్యాసి సీక్తా తుఖా టెటూ ఆశ్రమంలో కొండ చిలువ, త్రాచుపాము, వైపర్లు వంటి సరీసృపాలకు ఆశ్రయం కల్పించి వాటిని రక్షిస్తున్నారు. ఇలా పాములకు ఆశ్రయం కల్పించడం దాదాపు అయిదేళ్ల క్రితమే ప్రారంభమైంది. చదవండి: కుక్కపిల్ల కోసం కొండచిలువతో పోరాటం ఈ మేరకు బౌద్ధ సన్యాసి మాట్లాడుతూ.. పాములను వ్యాపారంగా భావించి అమ్మడం, చంపేయండం చూసి చలించిపోయిన తను వెంటనే వాటికి వ్యాపారుల నుంచి రక్షణ అందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. స్థానికులుతోపాటు, ప్రభుత్వ సంస్థలు వివిధ చోట్ల బంధించిన పాములను సన్యాసి వద్దకు తీసుకువస్తారని ఆయన పేర్కొన్నారు. వాటి సంరక్షణ, బాగోగులు చూసి పాములు తిరిగి అడవికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు భావించే వరకు ఆశ్రయంలో ఉంచి వాటికి భ్రదత కల్పిస్తానని తెలిపారు. ఇటీవల విలాతా అనేక రకాల పాములను హ్లావ్గా నేషనల్ పార్క్‌లో విడిచి వచ్చినట్లు వెల్లడించారు. అలా పాములు స్వేచ్చగా అడవిలోకి వెళ్లడం తనకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అయితే మళ్లీ వాటిని ప్రజలు పట్టుకొని అమ్మేందుకు ప్రయత్నిస్తే ఆందోళన చెందుతానని అన్నారు. కాగా సన్యాసి రక్షిస్తున్న పాములకు ఆహారం అందించేందుకు ఇవ్వడానికి సుమారు 300 డాలర్లు విరాళాలు అసవరం అవుతున్నాయని తెలిపారు. చదవండి: 37 ఏళ్లలో 37 సార్లు పాము కాటు! -
చిరుత దాడిలో సాధువు మృతి
సాక్షి, ముంబై : ధ్యానముద్రలో ఉన్న బౌద్ధ సాధువుపై చిరుత దాడి చేయడంతో అతడు మృతిచెందాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాలు... రాహుల్ వాకే బోధి(35) అనే సాధువు గురువారం తన ఇద్దరు అనుచరులతో కలిసి రామ్‌దేగి అడవుల్లోకి వెళ్లారు. ఈ క్రమంలో ఓ చెట్టుకింద కూర్చుని ధ్యానం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈలోగా అటుగా వచ్చిన చిరుత పులి రాహుల్‌పై దాడి చేసింది. దీంతో అతడి అనుచరులిద్దరు అక్కడి నుంచి పారిపోయారు. వారు తిరిగి వచ్చి చూసే సమయానికి రాహుల్ కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు రాహుల్ జాడ కోసం వెతుకున్న క్రమంలో అతడి శవం దొరికింది. దాడి చేసిన తర్వాత చాలా దూరంపాటు అతడి శవాన్ని ఈడ్చుకుపోయి ఉంటుందని పోలీసులు తెలిపారు. గత నెలరోజుల్లో రామ్‌దేగి పరిసర ప్రాంతాల్లో చిరుత దాడిలో ఐదుగురు మృతిచెందారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అడవిలోకి ఎవరూ వెళ్లవద్దని హెచ్చరికలు జారీచేసినప్పటికీ రాహుల్ నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాలు పోగొట్టుకున్నాడని.... ఇకనైనా ఎవరూ అటువైపుగా వెళ్లవద్దని సూచించారు. కాగా మనుషులను వేటాడి చంపుతుందనే కారణంగా ఇటీవలే అవని అనే ఆడపులిని మహారాష్ట్ర అటవీశాఖ అధికారులు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. దీంతో యవత్మాల్ పరిసర ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అవనిని హతం చేయడంతో మహారాష్ట్ర ప్రభుత్వంపై జంతుప్రేమికులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అంబేడ్కర్ మతం మార్చిన బౌద్ధ సన్యాసి మృతి
లక్నో: భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ బౌద్ధ మతం స్వీకరించిన కార్యక్రమాన్ని నిర్వహించిన బౌద్ధ సన్యాసి ప్రజ్ఞానంద్ కన్ను మూశారు. 90 ఏళ్ల ప్రజ్ఞానంద్ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఇక్కడి కింగ్ జార్జి మెడికల్ యూనివర్సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మదుమేహం, రక్తపోటు ఒక్కసారిగా పెరగడంతో ఆయన గురువారం చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. 1956 అక్టోబర్ 14న నాగ్‌పూర్‌లో అంబేడ్కర్ బౌద్ధమతం స్వీకరించినపుడు ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన ఏడుగురు సన్యాసుల్లో ప్రజ్ఞానంద్ ఒకరు. 13 ఏళ్లకే లక్నోకు వచ్చిన ప్రజ్ఞానంద్ బౌధ్ విహార్ మందిర్‌లో అత్యంత సీనియర్ సన్యాసిగా పేరొందారు. -
బంగ్లాదేశ్‌లో బౌద్ధ సన్యాసి దారుణ హత్య
ఢాకా: బంగ్లాదేశ్ లో మైనారిటీలకు రక్షణ కరువవుతోంది. ఇటీవల ఆ దేశంలో ఓ హిందువును నడిరోడ్డుపై దారుణంగా హతమార్చిన ఘటన మరువక మరో దారుణం చోటు చేసుకుంది. బందర్బన్ జిల్లాలో 75 ఏళ్ల బౌద్ధ సన్యాసిని కిరాతకంగా నరికి చంపారు. సమీప ఆలయం మాంగ్ షూ అనే బౌద్ధ సన్యాని మృతదేహం రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు బందర్బన్ డిప్యూటీ పోలీస్ చీఫ్ జైషీముద్ధీన్ తెలిపారు. కాగా బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ ఉగ్రవాదులు రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఓ బ్లాగర్, ఇంగ్లిష్ ప్రొఫెసర్‌ను వీరు హతమార్చిన విషయం తెలిసిందే. -
‘చెక్క’ని పాదముద్రలు..!
ఇవి దేవతా పాదముద్రలు కాదు.. వీటిని ఎవరూ చెక్కనూలేదు! మరి ఎలా వచ్చాయంటారా? చైనాకు చెందిన ఓ బౌద్ధ సన్యాసి మహత్మ్యం వల్ల ఇవి ఇలా చెక్కలో ఏర్పడ్డాయి. ఆయనకు ఏమీ మహిమలూ, మంత్రాలు తెలియవు. తెలిసిందల్లా నిత్యం దైవనామ స్మరణ చేయడమే. దాంతోనే ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. చైనాలోని ఖింగ్హాయ్ ప్రావిన్సులోని టాంగెరన్కు చెందిన హూచీ అనే 70 ఏళ్ల బౌద్ధ సన్యాసి ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే ఆలయానికి వచ్చి మోకరిల్లి ప్రార్థన చేస్తుంటారు. ఇలా రోజుకు కనీసం వెయ్యిసార్లు మోకరిల్లుతుంటారు. ఇలా దాదాపుగా 20 ఏళ్ల నుంచి చేస్తున్నారు. ప్రతిరోజూ ఒకేస్థానంలో ఆయన తన పాదాలను ఉంచి మోకరిల్లడం వల్ల అక్కడ ఆయన పాదముద్రలు ఏకంగా 1.2 అంగుళాల లోతులో ఇలా ఏర్పడ్డాయి. -
అమెరికాలో హంతకుడికి 249 ఏళ్ల జైలు శిక్ష
ఫీనిక్స్: ఆరుగురు బౌద్ధ సన్యాసులు సహా మొత్తం 9 మందిని అత్యంత దారుణంగా కాల్చి చంపి, దోపిడీకి పాల్పడిన నరహంతకుడికి అమెరికాలోని ఫీనిక్స్‌లో ఉన్న మారికోపా కౌంటీ సుపీరియర్ కోర్టు 249 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ హత్యలకు పాల్పడిన సమయంలో దోషి వయసు 17 ఏళ్లే కావడం.. హత్యకు గురైన వారు శాంతి కాముకులు కావడం, హత్య, దోపిడీ జరిగిన ప్రాంతం బౌద్ధాశ్రమం కావడంపై న్యాయమూర్తి జోసెఫ్ క్రీమర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనను అత్యంత పాశవికమైందిగా అభివర్ణించిన ఆయన మృతులందరూ శాంతిని అభిలషించేవారని, కలలో కూడా విధ్వంసాన్ని కోరుకునేవారు కాదని అన్నారు.