లక్నో: భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ బౌద్ధ మతం స్వీకరించిన కార్యక్రమాన్ని నిర్వహించిన బౌద్ధ సన్యాసి ప్రజ్ఞానంద్ కన్ను మూశారు. 90 ఏళ్ల ప్రజ్ఞానంద్ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఇక్కడి కింగ్ జార్జి మెడికల్ యూనివర్సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మదుమేహం, రక్తపోటు ఒక్కసారిగా పెరగడంతో ఆయన గురువారం చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. 1956 అక్టోబర్ 14న నాగ్‌పూర్‌లో అంబేడ్కర్ బౌద్ధమతం స్వీకరించినపుడు ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన ఏడుగురు సన్యాసుల్లో ప్రజ్ఞానంద్ ఒకరు. 13 ఏళ్లకే లక్నోకు వచ్చిన ప్రజ్ఞానంద్ బౌధ్ విహార్ మందిర్‌లో అత్యంత సీనియర్ సన్యాసిగా పేరొందారు.
Comments
Please login to add a commentAdd a comment