‘చెక్క’ని పాదముద్రలు..!
ఇవి దేవతా పాదముద్రలు కాదు.. వీటిని ఎవరూ చెక్కనూలేదు! మరి ఎలా వచ్చాయంటారా? చైనాకు చెందిన ఓ బౌద్ధ సన్యాసి మహత్మ్యం వల్ల ఇవి ఇలా చెక్కలో ఏర్పడ్డాయి. ఆయనకు ఏమీ మహిమలూ, మంత్రాలు తెలియవు. తెలిసిందల్లా నిత్యం దైవనామ స్మరణ చేయడమే. దాంతోనే ఈ అద్భుతం ఆవిష్కృతమైంది.
చైనాలోని ఖింగ్‌హాయ్ ప్రావిన్సులోని టాంగెరన్‌కు చెందిన హూచీ అనే 70 ఏళ్ల బౌద్ధ సన్యాసి ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే ఆలయానికి వచ్చి మోకరిల్లి ప్రార్థన చేస్తుంటారు. ఇలా రోజుకు కనీసం వెయ్యిసార్లు మోకరిల్లుతుంటారు. ఇలా దాదాపుగా 20 ఏళ్ల నుంచి చేస్తున్నారు. ప్రతిరోజూ ఒకేస్థానంలో ఆయన తన పాదాలను ఉంచి మోకరిల్లడం వల్ల అక్కడ ఆయన పాదముద్రలు ఏకంగా 1.2 అంగుళాల లోతులో ఇలా ఏర్పడ్డాయి.