బంగ్లాదేశ్ లో హిందువు దారుణ హత్య | Hindu Monastery Worker Hacked To Death In Bangladesh | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్ లో హిందువు దారుణ హత్య

Published Fri, Jun 10 2016 12:16 PM | Last Updated on Mon, Sep 4 2017 2:10 AM

Hindu Monastery Worker Hacked To Death In Bangladesh

ఢాకా: బంగ్లాదేశ్ లో మైనారిటీలకు రక్షణ కరువుతోంది. మైనారిటీల వరుస హత్యలు అక్కడ పరిపాటిగా మారాయి.  ఓ ఆశ్రమంలో పని చేస్తున్న వ్యక్తిని శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా నరికి చంపారు. పోలీసులు తెలిపిన వివరల ప్రకారం..  పాబ్నా జిల్లాలోని శ్రీ  ఠాకూర్ అనుకూల్ చంద్   ఆశ్రమంలో పని చేస్తున్న  నిత్యరంజన్ పాండే(62) ను శుక్రవారం ఉదయం మార్నింగ్  వాక్ కు వెళ్లారు. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడి చేసి నరికి చంపారు. దాడి ఉదయం పూట జరగడంతో సాక్షులు ఎవరూ లేరని పోలీసు అధికారి అబ్దుల్లా అల్ హసన్ తెలిపారు.  గడిచిన మూడేళ్లలో బంగ్లాదేశ్ లో 50 మంది మైనారిటీలు హత్యకు గురయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement