ఎమ్మెల్సీ కవిత సోషల్‌మీడియా అకౌంట్స్‌ హ్యాక్‌! | BRS MLC Kavitha Kalvakuntla Social Media Accounts Hacked - Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ కవిత సోషల్‌మీడియా అకౌంట్స్‌ హ్యాక్‌!

Published Wed, Jan 17 2024 6:39 PM | Last Updated on Wed, Jan 17 2024 7:06 PM

MLC Kavitha Social Media Accounts Hacked Police Complaint - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్‌కు గురయ్యాయి. ఈ విషయాన్ని ఆమె తన ‘ఎక్స్‌’ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ‘సైబర్ నేరగాళ్లు మంగళవారం నాడు రాత్రి 10 గంటల నుంచి బుధవారం ఉదయం 11 గంటల వరకు వరుసగా పలుసార్లు నా సోషల్‌ మీడయా ఖాతాల హ్యాకింగ్‌కు యత్నించారు. అనుమానాస్పదంగా లాగిన్ అయ్యి దుండగులు ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో సంబంధం లేని ఒక వీడియోను పోస్టు చేశారు’ అని ఆమె పేర్కొన్నారు.

అయితే వెంటనే గుర్తించిన కవిత తన సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్‌కు గురైనట్లు ‘ఎక్స్’ ద్వారా వెల్లడిస్తూ.. డీజీపీకి, సైబర్ సెక్యూరిటీ విభాగానికి ట్యాగ్ చేశారు. సోషల్ మీడియా ఖాతాలను పూర్తి స్థాయిలో తిరిగి పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ  కవిత తెలిపారు.

చదవండి: Congress: ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన.. అద్దంకి దయాకర్‌కు ఝలక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement