ఆన్‌లైన్ తప్పుతున్నారు
‘ఫేస్‌బుక్’ వంటి సోషల్ మీడియా వెబ్‌సైట్లు పిల్లలకు ఏమంత సురక్షితంగా ఉండటం లేదు. దేశవ్యాప్తంగా ‘ఫేస్‌బుక్’ వాడుతున్న బాలల్లో 52 శాతం మంది వేధింపులకు గురైనట్లు ఒక సర్వేలో తేలింది. హైదరాబాద్‌లో కూడా చాలామంది పిల్లలు ఆన్ లైన్‌లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. గర్‌లఫ్రెండ్/బాయ్‌ఫ్రెండ్ కోసం ఆన్‌లైన్‌లో ప్రయత్నాలు సాగించే వారు 36 శాతం మంది ఉన్నారు. రోజూ ‘నెట్’లోనే గంటల తరబడి చిక్కుకుపోయే పిల్లలు ఏకంగా 45 శాతం మంది ఉన్నారు. ఈ విషయం ‘సిటీప్లస్’ సర్వేలో తేలింది. పదేళ్ల నుంచి పద్దెనిమిదేళ్ల వయసు గల అబ్బాయిలు, అమ్మాయిలు మొత్తం 110 మందిని పది చొప్పున ప్రశ్నలడిగి సమాచారం సేకరించింది.
సిటీ ప్లస్ అడిగిన ప్రశ్నలు
1. ఆన్‌లైన్‌లో ఎప్పుడైనా వేధింపులకు గురయ్యారా?
2. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు ఎదురయ్యాయా?
3. ఫేస్‌బుక్‌లో మీ వాల్‌పై అవాంఛితమైన సం దేశాలను, అసభ్యకరమైన చిత్రాలను ఎవరైనా పోస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా?
4. ఆన్‌లైన్ చాటింగ్‌లో లైంగికపరమైన ప్రతిపాదనలను ఎదుర్కొన్నారా?
5. ఎన్నాళ్లుగా ఇంటర్నెట్ వాడుతున్నారు?
6. ఫేస్‌బుక్ అకౌంట్‌ను ఎప్పుడు తెరిచారు?
7. రోజూ ఇంటర్నెట్ వాడతారా?
8. ఆన్‌లైన్‌లో రహస్యంగా బూతుచిత్రాలు చూస్తుంటారా?
9. గర్ల్‌ఫ్రెండ్/బాయ్‌ఫ్రెండ్ కోసం ఆన్‌లైన్ స్నేహాలకు ప్రయత్నిస్తుంటారా?
10. ఆన్‌లైన్‌లో మీరేం చేస్తున్నారో మీ తల్లిదండ్రులకు తెలుసునా?
పై ప్రశ్నలకు సమాధానాలు (శాతాల్లోకి మార్చగా)