On-line
-
బస్ పాసుల జారీ ఇక ఆన్లైన్లోనే...
రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులు బస్సుపాసులకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని డిపో మేనేజర్ హేమంత్‌రావు తెలిపారు. సోమవారం ఈ సందర్భంగా ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ సిటీ జనరల్, సిటీ స్పెషల్, గ్రేటర్ హైదరాబాద్ పాసులు ఆన్లైన్ ద్వారా జారీ చేయనున్నట్లు చెప్పారు. డిస్ట్రిక్ట్, రూట్ పాసులను కూడాఆన్లైన్లోనే జారీకి నూతన సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. వారం రోజుల్లో డిస్ట్రిక్, రూట్ పాసులు కూడా ఆన్లైన్ ద్వారా అందజేస్తామన్నారు. విద్యార్థులు సహకరించాలని సూచించారు. -
ఆన్లైన్లో రవాణా సేవలు
హైదరాబాద్: రవాణాశాఖలో అన్ని రకాల సేవలను ఆన్లైన్లో అందించనున్నారు. ఈ సదుపాయం మే 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. సేవల ఫీజును మాత్రం మీ సేవలో చెల్లించాల్సి ఉంటుంది. ముందుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు అధికారులు ప్రకటించారు. -
విద్యుత్ శాఖలో ‘అప్నా’ సేవలు
ఇంటి వద్దకే వచ్చి బిల్లులు కట్టించుకునే విధానం ఆల్‌లైన్ బిల్లింగ్ పద్ధతికి గాజువాకలో శ్రీకారం విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ విద్యుత్ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)లో కొత్త సేవలు ప్రవేశిస్తున్నాయి. వినియోగదారుల కోసమే కాకుండా సంస్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. విద్యుత్ బిల్లులు చెల్లించాలంటే ఈ-సేవా కార్యాలయాల చుట్టూ పనులు మానుకొని తిరగాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్దకే వచ్చి మన బిల్లు కట్టించుకొనే సదుపాయాన్ని అందిస్తున్నారు. ‘అప్నా’ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ‘అప్నా’ కన్జూమర్స్ సర్వీస్ సెంటర్లను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్దేశించింది. దీంతో డిస్కం పరిధిలోని ఐదు జిల్లాల్లో ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో ఈ సేవలు ప్రారంభించారు. మొత్తం 1792 అప్నా సెంటర్లను ఏర్పాటు చేయగా వాటిలో 312 సెంటర్లు విశాఖలోనే పెట్టారు. వాటి ద్వారా ఇప్పటి వరకు విశాఖలో 2400 సర్వీసుల నుంచి రూ.7,62,187 వసూలు చేశారు. ప్రస్తుతానికి ప్రాధమిక దశలో ఉన్న ఈ సేవలు క్రమంగా విస్తరించనున్నారు. గాజువాకలో ఆన్లైన్ బిల్లింగ్: స్పాట్ బిల్లింగ్ రీడర్లు విద్యుత్ బిల్లు తీసిన తర్వాత సమాచారాన్ని ఈఆర్ఓ కార్యాలయానికి వెళ్లి అప్లోడ్ చేయడం ఇప్పటి వరకూ జరుగుతోంది. అయితే దీనివల్ల సమాచారం ఆలస్యంగా చేరుతోంది. ఇక మీదట ఆ సమస్య రాకుండా ఆన్లైన్ విద్యుత్ బిల్లింగ్ విధానాన్ని తీసుకువస్తున్నారు. తొలుత విశాఖ అర్బన్ పరిధిలోని గాజువాక ప్రాంతంలో ప్రయోగాత్మకంగా దానిని అమలు చేయనున్నారు. బిల్లు జనరేట్ కాగానే వినియోగదారుడి మొబైల్‌కు సంక్షిప్త సమాచారం వస్తుంది. వెంటనే ఆన్లైన్లో బిల్లు వివరాలు అప్లోడ్ అవుతాయి. రూఫ్‌టాప్ సోలార్ సిస్టం: ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్ ద్వారా ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం, జిల్లా కలెక్టరేట్లపై సోలార్ రూఫ్ టాప్ సిస్టంను ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం రూ.21 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇవి పూర్తయిన అనంతరం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ రూఫ్‌టాప్‌ను రూ.300 కోట్లతో పెటేందుకు అనుమతులు మంజూరయ్యాయి. బీఎన్ఆర్ కాలనీకి త్వరలో విద్యుత్ వెలుగులు నగరంలోని బీఎన్ఆర్ కాలనీలో 400 ఇళ్లకు నేటికీ విద్యుత్ సరఫరా లేక చీకటిలోనే బతుకుతున్నామని, తమకు వెలుగులు ప్రసాదించమని ఇటీవల ఆ ప్రాంత వాసులు సీఎండీని కోరారు. అర్బన్ డెవలప్మెంట్ స్కీం ద్వారా నిధులు సమీకరించి త్వరలోనే వాటన్నిటికీ విద్యుత్ సర్వీసులు ఇవ్వాలని ఏపీఈపీడీసీఎల్ నిర్ణయించింది. ఇప్పటికే నెంబర్ 1 రాష్ట్రంలోనే ఏపీఈపీడీసీఎల్ నెం.1 డిస్కంగా పేరు సంపాదించింది. అయినప్పటికీ లైన్ లాస్, ఈ-పేమెంట్ అంశాల్లో మెరుగుపడాల్సి ఉంది. లైన్‌లాస్‌ను 5 శాతం కంటే తక్కువకు తీసుకురావాలనేది లక్ష్యం. ఎల్ఈడీ బల్బుల పంపిణీ 93.4 శాతం పూర్తయ్యింది. వాటి పనితీరుపై ఏయూ ఆధ్వర్యంలో అధ్యయనం జరుగుతోంది. సగటున నెలకు 7 యూనిట్లు ఆదా అవుతున్నట్లు ప్రాధమికంగా తేలింది. గత జనవరి నుంచి 1.3 లక్షల కొత్త విద్యుత్ సర్వీసులు ఇచ్చాం. నగరంలోని బీఎన్ఆర్ కాలనీకి విద్యుత్ ఇవ్వడానికి సుమారు రూ.21 కోట్లు ఖర్చవుతుండగా ప్రజలు తమ వాటాగా మీటర్ల కోసం రూ.4 లేదా 5 లక్షలు చెల్లిస్తే సరిపోతుంది. - ఆర్ ముత్యాలరాజు, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్. -
కలెక్టరేట్ వద్ద రైతు ఆత్మహత్యాయత్నం
తన సమస్య పరిష్కారం కోసం కర్నూలు కలెక్టరేట్‌కు వచ్చిన ఓ రైతు అక్కడే ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాల్లోకి వెళితే.. రుద్రవరం మండలం పెద్దకంబలూరు గ్రామానికి చెందిన రైతు బ్రహ్మయ్యకు నాలుగు ఎకరాలకు పైగా భూమి ఉంది. భూమి వివరాలు.. ఆన్ లైన్ చేసేందుకు చాలా కాలంగా వీఆర్వో చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదు. దీంతో పై అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో విసిగి పోయిన బ్రహ్మయ్య సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టర్ ను కలిసేందుకు వచ్చాడు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందుబాటులోకి రాకపోవడంతో.. డీఆర్వోకు ఫిర్యాదు ఇచ్చాడు. తర్వాత వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు.. ఇది గమనించిన సిబ్బంది బ్రహ్మయ్యను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రైతుకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. -
ఆన్లైన్ తప్పుతున్నారు
‘ఫేస్బుక్’ వంటి సోషల్ మీడియా వెబ్సైట్లు పిల్లలకు ఏమంత సురక్షితంగా ఉండటం లేదు. దేశవ్యాప్తంగా ‘ఫేస్బుక్’ వాడుతున్న బాలల్లో 52 శాతం మంది వేధింపులకు గురైనట్లు ఒక సర్వేలో తేలింది. హైదరాబాద్‌లో కూడా చాలామంది పిల్లలు ఆన్ లైన్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. గర్లఫ్రెండ్/బాయ్‌ఫ్రెండ్ కోసం ఆన్లైన్లో ప్రయత్నాలు సాగించే వారు 36 శాతం మంది ఉన్నారు. రోజూ ‘నెట్’లోనే గంటల తరబడి చిక్కుకుపోయే పిల్లలు ఏకంగా 45 శాతం మంది ఉన్నారు. ఈ విషయం ‘సిటీప్లస్’ సర్వేలో తేలింది. పదేళ్ల నుంచి పద్దెనిమిదేళ్ల వయసు గల అబ్బాయిలు, అమ్మాయిలు మొత్తం 110 మందిని పది చొప్పున ప్రశ్నలడిగి సమాచారం సేకరించింది. సిటీ ప్లస్ అడిగిన ప్రశ్నలు 1. ఆన్లైన్లో ఎప్పుడైనా వేధింపులకు గురయ్యారా? 2. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు ఎదురయ్యాయా? 3. ఫేస్బుక్లో మీ వాల్‌పై అవాంఛితమైన సం దేశాలను, అసభ్యకరమైన చిత్రాలను ఎవరైనా పోస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? 4. ఆన్లైన్ చాటింగ్‌లో లైంగికపరమైన ప్రతిపాదనలను ఎదుర్కొన్నారా? 5. ఎన్నాళ్లుగా ఇంటర్నెట్ వాడుతున్నారు? 6. ఫేస్బుక్ అకౌంట్‌ను ఎప్పుడు తెరిచారు? 7. రోజూ ఇంటర్నెట్ వాడతారా? 8. ఆన్లైన్లో రహస్యంగా బూతుచిత్రాలు చూస్తుంటారా? 9. గర్ల్‌ఫ్రెండ్/బాయ్‌ఫ్రెండ్ కోసం ఆన్లైన్ స్నేహాలకు ప్రయత్నిస్తుంటారా? 10. ఆన్లైన్లో మీరేం చేస్తున్నారో మీ తల్లిదండ్రులకు తెలుసునా? పై ప్రశ్నలకు సమాధానాలు (శాతాల్లోకి మార్చగా)