Iranians
-
మరో 26/11కు కుట్ర... భగ్నం చేసిన పోలీసులు!
అహ్మదాబాద్: ముంబై తరహా దాడులకు మరోసారి జరిగిన ప్రయత్నాన్ని గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) పోలీసులు భగ్నం చేశారు. నలుగురు ఇరాన్ జాతీయులతో గుజరాత్ తీరానికి వస్తున్న ఇరాన్ బోటును సముద్రం మధ్యలోనే అడ్డుకుని అందులోని నలుగురు ఇరాన్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు అరేబియా సముద్రంలోని అంతర్జాతీయ సముద్ర జలాల సరిహద్దు వద్ద నిర్వహించిన ఈ ఆపరేషన్ విజయవంతమైంది. బోటులో ఉన్నవారి వద్ద నుంచి సుమారు రూ.3300 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్‌లో చరస్(హాషీష్ ఆయిల్)సహా ఇతర మాదక ద్రవ్యాలున్నాయి. భారత నేవీ, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో, గుజరాత్ యాంటీ టెరర్రిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. ఇదీ చదవండి.. జయప్రదను అరెస్ట్ చేయండి -
భారత్ కేంద్రంగా ఇరాన్ హ్యాకర్లు భారీ కుట్ర!
న్యూఢిల్లీ: గత కొంత కాలం క్రితం చైనా హ్యాకర్లు ఇండియాలోని కొన్ని సంస్థలు హ్యాక్ చేసిన సంగతి తేలిసిందే. ఇప్పుడు ఇరాన్ హ్యాకర్లు భారతదేశంలోని ఐటీ సేవల సంస్థలను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగుతున్నట్లు మైక్రోసాఫ్ట్ ఐటీ సంస్థలను హెచ్చరించింది. జూలై 2021కి ముందు దేశంలో ఉన్న చిన్న కంపెనీలను హ్యాక్ చేసిన ఇరాన్ హ్యాకర్లు ఇప్పుడు టెక్ దిగ్గజ కంపెనీలను సిద్దం అవుతున్నట్లు కంపెనీ తెలిపింది. గతంతో పోలిస్తే దాడుల సంఖ్య రోజు రోజుకి పెరుగతున్నట్లు తెలిపింది. 2021లో ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్న 40 కంటే ఎక్కువ ఐటీ కంపెనీలకు 1,600 నోటిఫికేషన్లను జారీ చేసినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. 2020లో కంపెనీ జారీ చేసిన 48 నోటిఫికేషన్ల కంటే ఇది చాలా ఎక్కువ. “ఇరానియన్ హ్యాకర్లు దృష్టి ముఖ్యంగా గత ఆరు నెలల్లో పుంజుకున్న ఐటీ రంగం మీద ఉంది. మా నోటిఫికేషన్లలో దాదాపు 10-13% గత ఆరు నెలల్లో ఇరాన్ హ్యాకర్లకు సంబంధించినవే. అంతకు ముందు ఆరు నెలల్లోని రెండున్నర శాతంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ” అని కంపెనీ తెలిపింది. (చదవండి: ఎలన్ మస్క్ ఆపసోపాలు, టిమ్ కుక్ అప్పుడే ప్రకటించేశాడు..?!) టెక్ దిగ్గజాలపై సైబర్ దాడులు ఈ హ్యాకర్లు ఇజ్రాయెల్ & యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆధారిత కంపెనీలను కూడా లక్ష్యంగా చేసుకోవడంతో పాటు భారతదేశంలోని టెక్నాలజీ దిగ్గజ ఐటీ సంస్థలపై "ఎక్కువగా దృష్టి" సారించినట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టు మధ్యకాలంలో ఇరానియన్ హ్యాకర్లు భారతదేశంలోని కంపెనీలతో రాజీ చేసుకున్నట్లు మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ సెంటర్, మైక్రోసాఫ్ట్ డీజిటల్ సెక్యూరిటీ యూనిట్ పేర్కొంది. ఇతర దేశాల అనుబంధ సంస్థలు, ఖాతాదారుల ఖాతాలను పరోక్షంగా అనుమతి పొందడం కోసం భారతీయ ఐటీ సంస్థలపై ఆకస్మిక దాడులకు చేసేందుకు సిద్దం అయినట్లు కంపెనీ ఊహించింది. భారతీయ ఐటీ సంస్థలు ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలకు బ్యాకెండ్ మౌలిక సదుపాయాలను కల్పిస్తాయి. భారీగా మొబైల్ దాడులు "ఇటువంటి దాడులు ముఖ్యంగా వారికి లాభదాయకంగా ఉంటాయి. దాడి చేసేవారికి ఈ డేటా చాలా విలువైనది, ఎందుకంటే పెద్ద సంఖ్యలో వినియోగదారుల ఖాతాలను యాక్సెస్ చేయవచ్చు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర కంపెనీల మీద దాడులు చేసే అవకాశం ఉన్నట్లు" అని భద్రతా సంస్థ కాస్పెర్స్కీ ఈ వారం ప్రారంభంలో ఒక నివేదికలో తెలిపింది. "అలాగే, రికార్డు స్థాయి సైబర్-దాడులతో ప్రపంచంలో అలజడి సృష్టించవచ్చు, ఎక్కువ సంఖ్యలో రాన్సమ్ వేర్ మొబైల్ దాడుల జరగవచ్చు" అని భద్రతా సంస్థ చెక్‌పాయింట్ రీసెర్చ్‌లోని రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ మాయా హోరోవిట్జ్ అన్నారు. (చదవండి: లక్ష పెట్టుబడితో 6 నెలల్లో రూ.60 లక్షలు సంపాదించిన మదుపరులు!) -
అద్దంలో చూసుకున్నట్టుంది
సిటీ వనితల వస్త్రధారణపై ఇరానీయులు మోనా, మరాల్, కమ్రాన్‌లు విమెన్స వరల్డ్స్ కాంగ్రెస్‌లో పాల్గొనడానికి వచ్చిన ఇరానీయులు! వీళ్లతో సంభాషణ ఫేస్‌బుక్‌తో మొదలై సాహిత్యందాకా సాగింది. హైదరాబాద్ రావడం ఇదే మొదటిసారైనా.. సిటీకి బాగా కనెక్టయ్యాం అంటున్నారు ఇరానీ వనితలు. ఇక్కడి మహిళల వస్త్రధారణకు, మాకు చాలా పోలికలున్నాయని చెప్పుకొచ్చారు. తాము కూడా సల్వార్ కమీజ్ను పోలిన డ్రెస్సులే వేసుకుంటామని.. ఇది బాగా నచ్చింద ంటున్నారు. అంతేకాదు చార్మినార్, సిటీ రోడ్లపై కనిపించే మసీదులు, గుళ్లు అందంగా కనిపించాయని తమ ఇష్టాన్ని వ్యక్తం చేశారు. మా దగ్గర నిషేధం ‘భారత్‌లో యూత్ ఫేస్‌బుక్‌కి చాలా ఎడిక్టెడ్. ఐ థింక్! నాకు తెలిసి దే వేకప్ విత్ దెయిర్ ఫెబీ స్టేటస్’ అని మోనా అన్నారు. మోనా టెహరాన్‌లోని ప్రైవేట్ కంపెనీలో వర్కింగ్ ఉమన్. ‘మా దగ్గర ఫేస్బుక్, ట్విట్టర్లు నిషేధం. యూత్ వేరేపేర్లతో.. సీక్రెట్‌గా అప్పుడప్పుడు బ్రౌజ్ చేస్తుంటార’ని కొనసాగించారు మరాల్. టెహరాన్‌లో చైల్డ్ లేబర్‌కి సంబంధించిన ఎన్జీవోలో పనిచేస్తున్న కమ్రాన్.. ‘నేను చూసినంత వరకు చైల్డ్ లేబర్ ఇండియాలో కన్నా ఇరాన్‌లోనే ఎక్కువ. పాకిస్థాన్, అఫ్గనిస్తాన్ లాంటి దేశాల నుంచి వలసవచ్చిన వాళ్ల పిల్లలే బాలకార్మికులుగా ఉంటారు. వాళ్ల కోసమే మా సంస్థ పనిచేస్తుంది’అన్నాడు. బాలీవుడ్ మస్తీ.. బాలీవుడ్ పిక్చర్స్ అంటే ఇష్టమని, అందులోనూ అమితాబ్‌బచ్చన్ సినిమాలంటే మరింత ఇష్టమని కమ్రాన్ తెలిపాడు. ‘షారూఖ్, సల్మాన్, ఆమీర్‌ఖాన్.. వెటరన్ యాక్టర్స్ రాజ్‌కపూర్, వైజయంతిమాల ఇష్టం’ అంది మోనా. ‘నేను ఇండియన్ మూవీస్ పెద్దగా చూడను. చూసిన లాస్ట్ మూవీ స్లమ్‌డాగ్ మిలియనీర్. ఇక్కడ ఫుల్ ఆఫ్ లైఫ్ ఉన్నా ఆర్ట్ మూవీస్ తక్కువే. ఎంతసేపూ కమర్షియల్ మూవీస్ వెంటే పడ్తారు. లిటరేచర్‌లో చూపించిన లైఫ్‌ని, క్రియేటివిటీని మూవీస్‌లో చూపించరు. ఇక్కడి బెంగాలీ, హిందీ సాహిత్యం ఎంతో బాగుంటాయి! ఝుంపాలాహిరి, అరుంధతీరాయ్లంటే నాకు చాలా ఇష్టం. వాళ్ల పుస్తకాలన్నీ మా పర్షియన్లోకి ట్రాన్స్‌లేట్ అవుతాయి. అలాగే రవీంద్రనాథ్ టాగూర్.. ఎంతగొప్ప రైటర్!’ అంటూ చెప్పుకుపోయింది. ‘ఓకే.. ఓకే లిటరేచర్ అండ్ మూవీస్ ఇన్ ఇండియా .. ఇరాన్’ అని ఓ టాపిక్ పెట్టుకొని దానిమీద తీరిగ్గా డిస్కస్ చేసుకుందాములే కానీ ఇప్పుడు కాదు.. సెషన్‌కి టైమ్ అవుతోంది అని మరాల్, కమ్రాన్లను అలర్ట్ చేస్తూ ఈ చర్చకు ఎండ్‌కార్డ్ వేసింది మోనా!