అహ్మదాబాద్: ముంబై తరహా దాడులకు మరోసారి జరిగిన ప్రయత్నాన్ని గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) పోలీసులు భగ్నం చేశారు. నలుగురు ఇరాన్ జాతీయులతో గుజరాత్ తీరానికి వస్తున్న ఇరాన్ బోటును సముద్రం మధ్యలోనే అడ్డుకుని అందులోని నలుగురు ఇరాన్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు అరేబియా సముద్రంలోని అంతర్జాతీయ సముద్ర జలాల సరిహద్దు వద్ద నిర్వహించిన ఈ ఆపరేషన్ విజయవంతమైంది. బోటులో ఉన్నవారి వద్ద నుంచి సుమారు రూ.3300 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్‌లో చరస్(హాషీష్ ఆయిల్)సహా ఇతర మాదక ద్రవ్యాలున్నాయి. భారత నేవీ, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో, గుజరాత్ యాంటీ టెరర్రిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి.
Comments
Please login to add a commentAdd a comment