ఓటీటీలో 'ఎలక్షన్‌' సినిమా స్ట్రీమింగ్‌.. ఎందులో అంటే..? | Vijay Kumar And Preethi Asrani Election Movie Released In OTT, Check Streaming Platform | Sakshi
Sakshi News home page

Election Movie In OTT: ఓటీటీలో 'ఎలక్షన్‌' సినిమా స్ట్రీమింగ్‌.. ఎందులో అంటే..?

Published Wed, Jul 10 2024 9:17 PM | Last Updated on Thu, Jul 11 2024 1:46 PM

Election Movie Streaming Now OTT

 కోలీవుడ్‍లో ఎన్నికలు, రాజకీయాలు వంటి అంశాల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం 'ఎలక్షన్‌'. యంగ్‌ హీరో విజయ్‌ కుమార్‌ ఇందులో ప్రధాన పాత్రలో నటించారు. రీల్‌ గుడ్‌ ఫిలిమ్స్‌ పతాకంపై  ఆదిత్య ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు తమిళ్‌ దీనిని తెరకెక్కించాడు. మే 17వ తేదీన ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. స్థానిక ఎన్నికల చుట్టూ జరిగే రాజకీయం ఆధారంగా ఈ 'ఎలక్షన్' సినిమా తెరకెక్కింది. సినిమా పట్ల మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

ఎలాంటి ప్రకటన లేకుండానే 'ఎలక్షన్' సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతుంది. తమిళ్‌తో పాటు తెలుగు,హిందీ,మలయాళం, కన్నడలో కూడా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ చిత్రంలో విజయ్ కుమార్‌తో పాటు ప్రీతి అరసని, జార్జ్ మర్యన్, దిలీపన్ తదితరులు కీలకపాత్రలలో మెప్పించారు. 

కోలీవుడ్‌లో 'సేతుమాన్‌' అనే చిత్రం ద్వారా డైరెక్టర్‌ తమిళ్‌ బాగా పాపులర్‌ అయ్యాడు. ఆయన నుంచి సినిమా విడుదల కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఒక వర్గం ప్రేక్షకులకు ఎలక్షన్‌ సినిమా పెద్దగా కనెక్ట్‌ కాలేదనే చెప్పవచ్చు. అలాంటిది అమెజాన్‌ ప్రైమ్‌లో ఏకంగా ఐదు భాషల్లో విడుదల చేశారు. ఓటీటీలో ఈ సినిమాపై ఎలాంటి రెస్పాన్స్‌ వస్తుందో చూడాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement