‘ఏనుగు’ వచ్చేస్తుంది | Arun Vijay Enugu Movie To Release On 1st July | Sakshi
Sakshi News home page

Enugu Movie : ‘ఏనుగు’ వచ్చేస్తుంది

Published Sat, Jun 25 2022 6:50 PM | Last Updated on Sat, Jun 25 2022 6:50 PM

Arun Vijay Enugu Movie To Release On 1st July - Sakshi

హరి దర్శకత్వంలో అరుణ్‌ విజయ్, ప్రియా భవానీ శంకర్‌ జంటగా నటించిన  చిత్రం ‘యానై’. సీహెచ్‌ సతీష్‌ కుమార్‌, వేదికకారన్‌పట్టి ఎస్.శక్తివేల్ నిర్మించిన ఈ తమిళ చిత్రం ‘ఏనుగు’ పేరుతో తెలుగులో రానుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను జులై 1 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు.

ఈ సందర్బంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ...మంచి కంటెంట్  ఉన్న సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం సమాజంలో ఉన్న సమస్యలని ఎంటర్టైన్మెంట్ రూపంలో ‘ఏనుగు’ ద్వారా చూపించబోతున్నాం. తెలుగులో దర్శకుడు హరి చేసిన గత సినిమాలు ఎంత పెద్ద హిట్టయ్యాయో ఇప్పుడు వస్తున్న కమర్శియల్ యాక్షన్ ఎంటర్ టైనర్  ‘ఏనుగు’చిత్రం కూడా అంతే పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’అన్నారు.

చిత్ర దర్శకుడు హరి మాట్లాడుతూ..‘‘ఏనుగు’ చిత్రంలో  ఎమోషనల్ కంటెంట్ తో పాటు మంచి ఫ్యామిలీ వాల్యూస్ ఇందులో చూయించడం జరిగింది.అలాగే ఈ సినిమాలో యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్, కామెడీ ఇలా ప్రేక్షకులకు కావలసిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. ఫ్యామిలీ తో వచ్చి చూసే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. ఇంతకుముందు నేను చేసిన చిత్రాలను ఆదరించి నట్లే  ఇప్పుడు మంచి కంటెంట్  తో జులై 1 న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ 'ఏనుగు"  సినిమాను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement