
అరుణ్ విజయ్ హీరోగా ‘వైశాలి’ ఫేమ్ అరివళగన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ హిట్ మూవీ ‘కుట్రమ్ 23’. మహిమా నంబియార్, అభినయ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రాన్ని ‘క్రైమ్ 23’ పేరుతో శ్రీ విజయ నరసింహా ఫిలింస్ పతాకంపై శ్రీమతి అరుణ ప్రసాద్ ధర్మిరెడ్డి సమర్పణలో ప్రసాద్ ధర్మిరెడ్డి, రంధి శంకరరావు, సూరాపాటి గాంధి, ఇందర్‌కుమార్ సంయుక్తంగా తెలుగులోకి అనువదించారు. ఈ నెల 18న ‘క్రైమ్ 23’ విడుదల కానుంది.
ప్రసాద్ ధర్మిరెడ్డి మాట్లాడుతూ- ‘‘రీసెంట్‌గా ప్రభాస్ చేతుల మీదగా విడుదల చేసిన మా చిత్రం ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇందులో పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా అరుణ్ విజయ్ బాగా నటించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా ఉంటుంది’’ అన్నారు. విజయ్‌కుమార్, అరవింద్ ఆకాశ్, వంశీకృష్ణ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ స్వరకర్త.