మామతో హీరో కలిసి చేసిన మూవీ యానై, ట్రైలర్‌ చూశారా? | Arun Vijay Starrer Yaanai Trailer Out Now | Sakshi
Sakshi News home page

Yaanai Trailer: మామతో హీరో కలిసి చేసిన మూవీ యానై, ట్రైలర్‌ చూశారా?

Published Thu, Jun 2 2022 5:27 PM | Last Updated on Thu, Jun 2 2022 5:27 PM

Arun Vijay Starrer Yaanai Trailer Out Now - Sakshi

కమర్షియల్‌ చిత్రాలకు మారుపేరు దర్శకుడు హరి. ఈ తరహా చిత్రాలకు కాస్త భిన్నంగా ఆయన తెరకెక్కించిన చిత్రం యానై అని హీరో అరుణ్‌ విజయ్‌ పేర్కొన్నారు. వీరి కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రాన్ని డ్రమ్‌ స్టిక్స్‌ ప్రొడక్షన్‌ పతాకంపై వెడిక్కారన్‌పట్టి ఎస్‌.శక్తివేల్‌ నిర్మించారు. ప్రియ భవానీ శంకర్‌ నాయకిగా నటించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్‌ 17వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా సోమవారం రాత్రి చెన్నైలో నిర్వహించిన చిత్ర ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో నటుడు విజయ్‌ మాట్లాడుతూ తాను తన మామ హరి కలిసి చిత్రం చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నామని, అది ఈ చిత్రంతో కుదిరిందని తెలిపారు. ఈ కథకు భారీ బడ్జెట్‌ అవసరం అవడంతో శక్తి వేల్‌ను సంప్రదించామన్నారు. ఇందులో తన చుట్టూ ఉన్న వారిని రక్షించుకునే పాత్రలో తాను నటించానన్నారు. ఇది చాలెంజింగ్‌ అనిపించిందన్నారు.

చదవండి: నాగార్జునను సైడ్‌ చేసి సమంతకు బాధ్యతలు!
ఆస్ట్రేలియా ఆఫర్‌, భారీ రెమ్యునరేషన్‌, కానీ మేనేజర్‌ను పర్సనల్‌గా కలవాలట!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement