అరుణ్ విజయ్
తమిళ హీరో అరుణ్ విజయ్ దుబాయ్ వెళ్లారు. ఇంకేముంటుంది? ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సాహో’ షెడ్యూల్ అబుదాబిలో జరుగుతోంది కదా ఆ షూట్‌లో పాల్గొనడానికి వెళ్లాడేమో అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ‘సాహో’లో అరుణ్ నటిస్తున్నారు. అయితే దుబాయ్ వెళ్లింది మాత్రం ‘నవాబ్’ షూట్ కోసం.
మణిరత్నం దర్శకత్వంలో అరవింద స్వామి, శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్, జ్యోతిక, అదితీ రావ్ హైదరీ ముఖ్య తారలుగా రూపొందుతోన్న మల్టీస్టారర్ మూవీ ‘చెక్క చివంద వానమ్’. తెలుగులో ‘నవాబ్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా చెన్నై షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. నెక్ట్స్ షెడ్యూల్ దుబాయ్‌లో జరగనుంది. ‘‘ఈ సినిమాలో నా ఫైనల్ షెడ్యూల్ కోసం దుబాయ్ వెళ్తున్నాను’’ అని పేర్కొన్నారు అరుణ్ విజయ్. తమిళంలో అరుణ్ విజయ్ హీరోగా నటించిన ‘కుట్రమ్ 23’ తెలుగులో ‘క్రైమ్ 23’ పేరుతో రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment