టైటిల్ : ఏనుగు
నటీనటులు : అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, రాధికా శరత్ కుమార్, యోగిబాబు, అమ్ము అభిరామి, కేజీయఫ్ రామచంద్రరాజు తదితరులు
నిర్మాత: సీహెచ్ సతీష్ కుమార్
దర్శకత్వం: హరి
సంగీతం : జీవీ ప్రకాశ్ కుమార్
సినిమాటోగ్రఫీ: గోపీనాథ్
ఎడిటర్: ఆంథోని
విడుదల తేది: జులై 1,2022
హరి దర్శకత్వంలో అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన చిత్రం ‘యానై’. ఈ తమిళ చిత్రం ‘ఏనుగు’ పేరుతో తెలుగులో విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
కాకినాడకు చెందిన పీఆర్‌వీ, ‘సముద్రం’ కుటుంబాల మధ్య శత్రుత్వం ఉంటుంది. పీఆర్‌వీ రెండో భార్య కొడుకు రవి(అరుణ్) తన కుటుంబానికి, సవతి తల్లికొడుకులు(సముద్రఖని, బోస్ వెంకట్, సంజీవ్)కు అండగా నిలబడతాడు. ‘సముద్రం’కుటుంబానికి చెందిన లింగం( కేజీయఫ్ గరుడ రామ్)తో తన ఫ్యామిలీకి ముప్పు ఉందని తెలుసుకున్న రవి.. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ అన్నయ్యలకు ఎలాంటి హానీ కలగకుండా చూసుకుంటాడు. ఈ క్రమంలో తన అన్నయ్య(సముద్రఖని)కూతురు దేవి(అమ్ము అభిరామి)చేసిన పనికి రవి,అతని తల్లి(రాధికా శరత్ కుమార్)ఇంటిని వీడాల్సి వస్తుంది. అసలు దేవి చేసిన తప్పేంటి? దాని వల్ల రవి ఎందుకు అన్నయ్యలకు దూరమయ్యాడు? పీవీఆర్, సముద్రం కుటంబాల మధ్య వైరుధ్యుం ఎందుకు ఏర్పడింది? తండ్రి మరణం అన్నదమ్ముల మధ్య ఎలాంటి చిచ్చు పెట్టింది? ఈ మధ్యలో మేరీ (ప్రియా భవానీ శంకర్)తో రవి ప్రేమాయణం ఎలా సాగింది? చివరకు రవి కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? అనేదే మితగా కథ
ఎలా ఉందంటే..
సింగం సిరీస్, పూజ సినిమాలతో కమర్శియల్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు హరి. ఆయన చిత్రాలకు తెలుగులోనూ మంచి ఆదరణ ఉంది. అందుకే తమిళ సినిమా యానైని తెలుగు ఏనుగు పేరుతో విడుదల చేశారు. యాక్షన్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఎమోషనల్ కంటెంట్‌తో పాటు మంచి ఫ్యామిలీ వ్యాల్యూస్ ఉన్నాయి.
ఫస్టాఫ్ అంతా పీవీఆర్, సముద్రం కుటుంబాల మధ్య వైర్యం, మేరి, రవిల ప్రేమాయణంతో రొటీన్‌గా సాగుతుంది. ప్రధాన పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్నాడు దర్శకుడు. యోగిబాబుతో వచ్చే కామెడీ సీన్స్ నవ్వులు పూయిస్తాయి. పీవీఆర్ కుటుంబంలో చీలికలు ఏర్పడడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇక సెకండాఫ్ మొత్తం ఫ్యామిలీ ఎమోషన్స్‌తో నింపేశాడు. అన్నయ్య కూతురు దేవిని వెతికే క్రమంలో వచ్చే ట్విస్టులు, ఎమోషన్ సీన్స్ సినిమాని మరోస్థాయి తీసుకెళ్తాయి. రవి తండ్రి చనిపోయిన సీన్ అయితే కంటతడి పెట్టిస్తాయి. అయితే రొటీన్ స్క్రీన్‌ప్లే, కొన్ని సాగదీత సీన్స్ సినిమా స్థాయిని తగ్గిస్తాయి. అలాగే నిడివి కూడా ఎక్కువగా ఉండడం మైనస్. ఫ్యామిలీ ఎమోషన్స్ కోరుకునే ప్రేక్షకులను ఈ సినిమా నచ్చుతుంది.
ఎవరెలా చేశారంటే..
రవి పాత్రకు న్యాయం చేశాడు అరుణ్ విజయ్. యాక్షన్, ఎమోషన్స్ సీన్స్‌లో చక్కగా నటించాడు. ఇక మేరి పాత్రలో ఒదిగిపోయింది ప్రియా భవానీ శంకర్. తెరపై తెలుగింటి అమ్మాయిగా, అందంగా కనిపించింది. పీఆర్‌వీ కుటుంబ పెద్దగా సముద్రఖని తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో ఆయనది చాలా కీలకమైన పాత్ర. రవి తల్లిగా రాధిక శరత్ కుమార్ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించారు. విలన్ గా గరుడ రామ్ ఆకట్టుకున్నాడు. జిమ్మిగా యోగిబాబు తనదైన కామెడీ పంచ్‌లతో నవ్వించాడు. మిగిలిన నటీటనులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు.
ఇక సాంకెతిక విషయానికొస్తే.. జీవి ప్రకాశ్ సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయినా.. నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. గోపినాథ్ సినిమాటోగ్రఫి బాగుంది. సముద్ర తీరం అందాలను తెరపై చక్కగా చూపించాడు. ఎడిటర్ ఆంథోని తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. కొన్ని సీన్స్‌కి తొలగించి, నిడివిని తగ్గిస్తే సినిమా స్థాయి మరోరకంగా ఉండేది. నిర్మాణ విలువల చాలా రిచ్‌గా, సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment