
సిక్స్‌ప్యాక్‌కు మారిన అరుణ్ విజయ్
హీరోలు సిక్స్‌ప్యాక్ బాడీకి తయారవడం అన్నది కొత్తేమీ కాదు. అయితే ఆ తరహా ప్యాక్‌బాడీలకు క్రేజ్ మాత్రం తగ్గలేదు.
హీరోలు సిక్స్‌ప్యాక్ బాడీకి తయారవడం అన్నది కొత్తేమీ కాదు. అయితే ఆ తరహా ప్యాక్‌బాడీలకు క్రేజ్ మాత్రం తగ్గలేదు. బాలీవుడ్ సూపర్‌స్టార్స్ అమీర్‌ఖాన్, షారూఖ్ ఖాన్‌ల నుంచి కోలీవుడ్ యువ హీరోలు భరత్, అధర్వ వరకు పలువురు సిక్స్‌ప్యాక్‌కు మారినవారే. తాజాగా నటుడు అరుణ్ విజయ్ తన సిక్స్‌ప్యాక్ చూపించడానికి రెడీ అయ్యారు. ఇందుకోసం ఆయన ఆరు నెలలు నిరంతరంగా శ్రమించారట. ఆయన పర్సనల్ ట్రైనర్ శివకుమార్ కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించి తనను సిక్స్‌ప్యాక్ బాడీ బిల్డర్‌గా తయారు చేశారంటున్నారు అరుణ్ విజయ్.
ఇంతకీ ఈయన ఇంత శ్రమించి సిక్స్‌ప్యాక్‌కు మారింది ఎందుకనుకుంటున్నారు? అజిత్ హీరోగా నటిస్తున్న ఎన్నై అరిందాల్ చిత్రం కోసం అట. గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రంలో అరుణ్‌విజయ్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఆ పాత్ర గురించి ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్న ఈ యువ నటుడు ఎన్నై అరిందాల్ చిత్ర విడుదల కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నానన్నారు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. అరుణ్ విజయ్ హీరోగా నటించిన వా డీల్ వా చిత్రం తదుపరి విడుదలకు సిద్ధం అవుతోంది.