అనాథాశ్రమంలో బర్త్‌డే సెలబ్రేట్‌ చేసుకున్న స్టార్‌ హీరో | Arun Vijay Celebrated His Birthday At An Orphanage | Sakshi
Sakshi News home page

Arun Vijay : అనాథాశ్రమంలో బర్త్‌డే సెలబ్రేట్‌ చేసుకున్న స్టార్‌ హీరో

Published Mon, Nov 21 2022 9:28 AM | Last Updated on Mon, Nov 21 2022 10:09 AM

Arun Vijay Celebrated His Birthday At An Orphanage - Sakshi

తమిళ సినిమా: నటుడు అరుణ్‌ విజయ్‌ శనివారం తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు అన్నదానం, రక్తదా నం భారీ ఎత్తున నిర్వహించారు. పోరాడి కథానా యకుడుగా ఉన్నత స్థాయికి చేరుకున్న నటుడు అరుణ్‌ విజయ్‌. తమిళంతోపాటు తెలుగు తదితర భాషల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవ ల ఈయన కథానాయకుడిగా నటింన చిత్రాలు వరుసగా మం విజయాన్ని అందుకున్నాయి.

తా జాగా తమిళ్‌ రాకర్స్‌ అనే సిరీస్‌తో వెబ్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టి సక్సెస్‌ అయ్యారు. కాగా ఆయన శనివారం తన పుట్టినరోజు వేడుకలను చెన్నైలోని ఉదవుమ్‌ కరంగల్‌ అనాథ ఆశ్రమంలో అనాథ బాలల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆ ఆ శ్రమంలో బాలలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన అభిమాన సంఘం నిర్వాహకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అనంతరం అభిమానులు స్థానిక రాయపేటలోని ప్రభుత్వాస్పత్రిలో రక్తదానం చేశారు. కాగా ప్రస్తుతం అరుణ్‌ విజయ్‌ అచ్చం ఎన్బదు ఇల్లయే అనే చిత్రంలో నటిస్తున్నారు. విజయ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర యూనిట్‌ అరుణ్‌ విజయ్‌ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన కేక్‌ కట్‌ చేసి, యూనిట్‌ సభ్యులకు పంపిణీ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement