
Arun Vijay New Web Series On Tamil Rockers: సినిమా వేధించే ప్రధాన సమస్యల్లో పైరసీ ఒకటి. పైరసీ మహమ్మారీ కారణంగా అనేక సూపర్ హిట్ మూవీస్ కలెక్షన్లలో వెనుకపడ్డాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సినిమా.. ఈ పైరసీ భూతానికి బలి అవుతూనే వస్తోంది. గతంలో చిత్రాలు నెలలు, వందల రోజులు ఆడి, సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుపుకునేవి. కానీ ఈ పైరసీ ఎంట్రీ ఇచ్చాక సినిమాలు పట్టుమని నెల రోజులు కూడా కనిపించట్లేదు. ఇలాంటి పైరసీ వెబ్‌సైట్‌లో ప్రముఖంగా చెప్పుకునేది తమిళ్ రాకర్స్. దక్షిణాది సినిమాలకు ఇది అతిపెద్ద గండగా పరిణిమించిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని వాడుతూ పైరసీ ప్రింట్‌లను తీసుకువచ్చి దర్శకనిర్మాతలకు ముచ్చెటమలు పట్టేలా చేసింది ఈ వెబ్‌సైట్.
తాజాగా ఈ తమిళ్ రాకర్స్‌పై ఓ వెబ్ సిరీస్ రానుంది. తమిళ్ రాకర్స్ వల్ల నిర్మాతలు ఎదుర్కొన్ని కష్టాలను ఈ వెబ్ సిరీస్‌లో చూపించనున్నారట. ఈ సిరీస్‌కు ప్రముఖ దర్శకుడు శంకర్ శిష్యుడు అరివళగన్ డైరెక్షన్ చేయనున్నారు. ఇందులో అరుణ్ విజయ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇదివరకు కుట్రమ్ 23, బోర్డర్ సినిమాలు వచ్చి ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ కూడా మంచి విజయం సాధిస్తుందని చిత్రబృంద నమ్మకంగా ఉంది. తమిళ్ రాకర్స్ పేరుతోనే టైటిల్ ప్రకటన ఇచ్చి ఆసక్తి కలిగించారు. ఈ వెబ్ సిరీస్ టీజర్‌ను జులై 3న విడుదల చేశారు. ఈ వెబ్ సిరీస్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
చదవండి: హీరో విశాల్‌కు గాయాలు.. నిలిచిపోయిన సినిమా షూటింగ్
మిస్ ఇండియా కిరీటం.. 21 ఏళ్ల అందం సొంతం
కమల్ హాసన్‌కు ప్రభుత్వం నోటీసులు ! కారణం ?
Comments
Please login to add a commentAdd a comment