pyracy
-
Tamilrockerz Official Teaser: పైరసీ వెబ్‌సైట్‌పై వెబ్ సిరీస్.. ఆసక్తిగా టీజర్
Arun Vijay New Web Series On Tamil Rockers: సినిమా వేధించే ప్రధాన సమస్యల్లో పైరసీ ఒకటి. పైరసీ మహమ్మారీ కారణంగా అనేక సూపర్ హిట్ మూవీస్ కలెక్షన్లలో వెనుకపడ్డాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సినిమా.. ఈ పైరసీ భూతానికి బలి అవుతూనే వస్తోంది. గతంలో చిత్రాలు నెలలు, వందల రోజులు ఆడి, సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుపుకునేవి. కానీ ఈ పైరసీ ఎంట్రీ ఇచ్చాక సినిమాలు పట్టుమని నెల రోజులు కూడా కనిపించట్లేదు. ఇలాంటి పైరసీ వెబ్సైట్లో ప్రముఖంగా చెప్పుకునేది తమిళ్ రాకర్స్. దక్షిణాది సినిమాలకు ఇది అతిపెద్ద గండగా పరిణిమించిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని వాడుతూ పైరసీ ప్రింట్లను తీసుకువచ్చి దర్శకనిర్మాతలకు ముచ్చెటమలు పట్టేలా చేసింది ఈ వెబ్సైట్. తాజాగా ఈ తమిళ్ రాకర్స్‌పై ఓ వెబ్ సిరీస్ రానుంది. తమిళ్ రాకర్స్ వల్ల నిర్మాతలు ఎదుర్కొన్ని కష్టాలను ఈ వెబ్ సిరీస్‌లో చూపించనున్నారట. ఈ సిరీస్‌కు ప్రముఖ దర్శకుడు శంకర్ శిష్యుడు అరివళగన్ డైరెక్షన్ చేయనున్నారు. ఇందులో అరుణ్ విజయ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకు కుట్రమ్ 23, బోర్డర్ సినిమాలు వచ్చి ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ కూడా మంచి విజయం సాధిస్తుందని చిత్రబృంద నమ్మకంగా ఉంది. తమిళ్ రాకర్స్ పేరుతోనే టైటిల్ ప్రకటన ఇచ్చి ఆసక్తి కలిగించారు. ఈ వెబ్ సిరీస్ టీజర్‌ను జులై 3న విడుదల చేశారు. ఈ వెబ్ సిరీస్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. చదవండి: హీరో విశాల్‌కు గాయాలు.. నిలిచిపోయిన సినిమా షూటింగ్ మిస్ ఇండియా కిరీటం.. 21 ఏళ్ల అందం సొంతం కమల్ హాసన్‌కు ప్రభుత్వం నోటీసులు ! కారణం ? -
తృటిలో తప్పించుకున్న బాహుబలి
హైదరాబాద్ : ప్రపంచమంతా అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న'బాహుబలి' చిత్రం తృటిలో పైరసీ భూతం నుంచి తప్పించుకుంది. దీనికి సంబంధించిన వివరాలను చిత్ర దర్శకుడు రాజమౌళి మంగళవారం హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా తొమ్మిదిమంది పైరసీదారులను పట్టుకున్న బెంగళూరు పోలీసులకు రాజమౌళి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. పెద్ద సినిమాను పెద్ద తెరపై మాత్రమే చూడాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. థియేటర్లలో నైట్ షో అయిన తరువాత సినిమాలను పైరసీ చేస్తున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందని రాజమౌళి తెలిపారు. దీనిపై థియేటర్ యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు ఈ నెల 10న బహుబలి చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు. చిత్ర పరిశ్రమను పట్టిపీడిస్తున్న పైరసీ భూతాన్ని అరికట్టేందుకు అందరూ ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రెండున్నర సంవత్సరాలపాటు అనేక వ్యయ ప్రయాసలకోర్చి, ప్రపంచంలోని తెలుగు ప్రజలందరూ గర్వపడేలా బాహుబలి చిత్రాన్ని తెరకెక్కించారని అరవింద్ కొనియాడారు. బెంగళూరు పోలీసుల చొరవ కారణంగా పెద్ద పైరసీ భూతం నుంచి బాహుబలి సినిమా బయట పడిందన్నారు. దేశంలోని సర్వీస్ ప్రొవైడర్లందరికీ ఈ పైరసీ సైట్ల వివరాలను అందించామని, ఆన్లైన్ పైరసీ నియంత్రణకు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. దీనిపై కోర్టు ప్రత్యేక ఆర్డరును జారీ చేసిందని.. ఇక ముందు ఎవరు ఎక్కడ సినిమాను పైరసీ చేసినా క్షణాల్లో తెలిసి పోతుందన్నారు. ఈ సమావేశంలో చిత్ర నిర్మాత శోభూ యార్లగడ్డ, హీరో రానాతో పాటు పలువురు పాల్గొన్నారు.