Arun Vijay Sinam Movie Release Date Confirmed, Deets Inside - Sakshi
Sakshi News home page

Arun Vijay: థియేటర్లో విడుదలకు సిద్ధమైన అరుణ్‌ విజయ్‌ చిత్రం

Published Sat, Aug 27 2022 3:34 PM | Last Updated on Sat, Aug 27 2022 4:09 PM

Arun Vijay Sinam Movie Release on Theatres On September 16th - Sakshi

అరుణ్‌ విజయ్‌ కథానాయకుడిగా తొలిసారిగా నటించిన వెబ్‌ సిరీస్‌ తమిళ్‌ రాకర్స్‌ ఇటీవల ఓటీటీలో విడుదలై విశేష ఆదరణను అందుకుంటోంది. కాగా ఈయన నటించిన మరో చిత్రం సినమ్‌. జీఎన్‌ఆర్‌ కుమరవేలన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలక్‌ లాల్వాణి నాయకిగా నటించింది. నటుడు కాళీవెంకట్‌ ముఖ్య పాత్ర పోషించారు. ఈ త్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్‌ 16న విడుదలకు సిద్ధం అవుతోంది.

చదవండి: బిగ్‌బాస్‌లోకి స్టార్‌ సింగర్స్‌ దంపతులు? ఇక ప్రేక్షకులకు రెట్టింపు వినోదమే..

కాగా శుక్రవారం చిత్రంలోని నెంజెల్లాం అనే పాటను విడుదల చేశారు. సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్, గాయని శివాంగి కలిసి పాడిన ఈ పాటకు మం స్పందన వస్తోందని యూనిట్‌ వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. కాగా ఇందులో నటుడు అరుణ్‌ విజయ్‌ పోలీస్‌ అధికారిగా నటించడం విశేషం. చిత్రం క్రైమ్‌ థ్రిల్లర్‌ నేప«థ్యంలో సాగే యాక్షన్‌ ఎంటర్‌టెయినర్‌గా ఉంటుందని దర్శకుడు తెలిపారు. దీనికి షబీర్‌ సంగీతాన్ని అందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement