తమిళ సినిమా: అరుణ్ విజయ్ కథానాయకుడు నటించిన చిత్రం బోర్డర్. ఆయనకు జంటగా నటి రెజీనా, స్టెఫీ పటేల్ నటించారు. అరివళగన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆల్ ఇన్ పిక్చర్స్ పతాకంపై విజయరాఘవేంద్ర నిర్మించారు. శ్యామ్ సీఎస్ సంగీతాన్ని, బి.రాజశేఖర్ చాయాగ్రహణంను అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. దీని తమిళనాడు విడుదల హక్కులను పొందిన 11:11 ప్రొడక్షన్స్ అధినేతప్రభు తిలక్ చిత్రాన్ని అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయనున్నట్లు సోమవారం అధికారికంగా ప్రకటించారు.
అరుణ్ విజయ్ ఇంతకు ముందు నటించిన చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అలాగే ఆయన తొలిసారిగా నటించిన వెబ్ సిరీస్ తమిళ్ రాకర్స్ ఇటీవల ఓటీటీలో విడుదలై వీక్షకుల నుంచి మంచి ఆదరణను పొందుతోంది. దీంతో బోర్డర్ చిత్రంపై మరింత అంచనాలు నెలకొన్నాయి. కమర్షియల్ అంశాలతో యాక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ విడదలై ఇప్పటికే మంచి స్పందన తెచ్చుకుంది.
దీనిపై ప్రభు తిలక్ మాట్లాడుతూ.. తమిళ చిత్ర పరిశ్రమలో మంచి అంచనాలు ఏర్పరచుకున్న ఈ చిత్రాన్ని తమ సంస్థ ద్వారా విడుదల చేస్తుండడం సంతోషంగా ఉందన్నారు. తమ సంస్థ ద్వారా మంచి కథాంశంతో కూడిన చిత్రాలను, నిర్మించడం, విడుదల చేయటం చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. దర్శకుడు అరివళగన్ చిత్రాన్ని బ్రహ్మాండంగా తెరకెక్కించారన్నారు. చిత్రానికి పనిచేసిన సాంకేతిక వర్గం పనితనం అభి నందనీయమన్నారు. ఇక నటు డు అరుణ్ విజయ్ గురించి చెప్పాలంటే ఆయన అద్భుతమైన నటన చిత్రాన్ని గొప్పగా మార్చిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment