కోలీవుడ్ హీరో అరుణ్ విజయ్, అమీ జాక్సన్ నటిస్తోన్న లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ ‘మిషన్: చాప్టర్ 1’. ఈ చిత్రానికి ఎం.రాజశేఖర్, ఎస్.స్వాతి నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందిస్తూ వరుస సక్సెస్‌లను సొంతం చేసుకుంటున్న లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దర్శకుడు విజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో 2.0, పొన్నియిన్ సెల్వన్, ఇండియన్ 2 వంటి చిత్రాలు సహా ఎన్నో భారీ చిత్రాలను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని కేవలం 70 రోజుల్లో లండన్, చెన్నై సహా పలు లొకేషన్స్‌లో శరవేగంగా చిత్రీకరించటం గొప్ప విశేషం.
తాజాగా ‘మిషన్: చాప్టర్ 1’ సినిమాను విశ్లేషించి ఒక పరిమితమైన హద్దులని లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని లైకా టీమ్ భావిస్తోంది. దీంతో లైకా సంస్థ ‘మిషన్: చాప్టర్ 1’ చిత్రాన్ని నాలుగు భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు . ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, ఆడియో, థియేట్రికల్ రిలీజ్‌కి సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.
చాలా గ్యాప్ తర్వాత.. 2.0లో నటించి అలరించిన ముద్దుగుమ్మ అమీ జాక్సన్ ఈ చిత్రంతో సినిమాల్లో అడుగు పెడుతున్నారు. జైలును సంరక్షించే ఆఫీసర్ పాత్రలో ఆమె కనిపించనున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన విలక్షణ నటి నిమిషా సజయన్ ఈ మూవీలో ఓ కీలక పాత్రను పోషించారు. జీవీ ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతమందించారు. ఈ సినిమా కోసం లండన్ జైలును పోలి ఉండేలా చెన్నైలో భారీగా ఖర్చుతో ఓ జైలు సెట్ వేశారు.
Comments
Please login to add a commentAdd a comment