
తండ్రి విజయకుమార్‌తో అరుణ్‌విజయ్
వదంతులను ప్రచారం చేయొద్దని నటుడు అరుణ్ విజయ్ కోరారు. ఆయన సీనియర్ నటుడు విజయ్‌కుమార్ వారసుడన్న విషయం తెలిసిందే. ఎంజీఆర్, శివాజీ గణేషన్ కాలం నుంచి నేటి తరం నటీనటుల వరకు నటిస్తున్న విజయ్‌కుమార్ మొదట్లో హీరోగా, విలన్‌గా నటించారు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తమిళం, తెలుగు తదితర భాషల్లో నటిస్తున్నారు.
ఇటీవల తన కొడుకు అరుణ్ విజయ్ కథానాయకుడిగా సినం అనే చిత్రాన్ని నిర్మించారు. విజయ్‌కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన నటుడు అరుణ్ విజయ్ తన తండ్రి విజయకుమార్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని, వదంతులను ప్రచారం చేయవద్దని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఈయన కథానాయకుడిగా నటించిన యానై, సినమ్ చిత్రాలు ఇటీవల విడుదలై మంచి ప్రజాదరణ పొందాయి.
అదే విధంగా తమిళ రాకర్స్ అనే వెబ్‌సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ప్రశంసలు అందుకుంటోంది. కాగా ప్రస్తుతం ఈయన ఏఎల్ విజయ్ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో నటి అమీజాక్సన్ హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇస్తోంది. దీనికి అచ్చం యంబదు ఇల్లయే అనే టైటిల్ నిర్ణయించారు. ఈ చిత్ర షూటింగ్ ఆగస్టు 20న ప్రారంభమైంది.
Comments
Please login to add a commentAdd a comment