నటుడు కాకముందే పెళ్లి.. ఇప్పుడేమో స్టార్ హీరో.. ఇతడెవరంటే? | Amaran Movie Actor Siva Karthikeyan Movies And Family Details | Sakshi
Sakshi News home page

Guess The Actor: బ్యాక్ గ్రౌండ్ లేదు.. కానీ ఇండస్ట్రీలో టాప్ హీరో!

Published Sun, Nov 3 2024 11:23 AM | Last Updated on Sun, Nov 3 2024 11:38 AM

Amaran Movie Actor Siva Karthikeyan Movies And Family Details

సినిమా ఇండస్ట్రీలో నిలబడాలంటే బ్యాక్ గ్రౌండ్ ఉండాలని చాలామంది అనుకుంటారు. కానీ అప్పుడప్పుడు ఎలాంటి అంచనాల్లేకుండా నటుడు అయినోళ్లు.. కష్టంతో పాటు అదృష్టం కలిసొచ్చి స్టార్స్ అవుతారు. ఇతడు కూడా సేమ్ అలాంటివాడే. టీవీ యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. పైన హీరో ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

పైన ఫొటోలో ఉన్నది 'అమరన్' ఫేమ్ శివకార్తికేయన్. ఏంటి అతడా? అని ఆశ్చర్యపోతున్నారా! ఇది సినిమాల్లోకి రాకముందు, పెళ్లి టైంలో తీసుకున్న ఫొటో ఇది. శివకార్తికేయన్ పక్కనున్న ఉన్నది ఇతడి భార్య ఆర్తి. 2010లో వివాహం జరిగింది. తమిళనాడులో పుట్టిపెరిగిన శివకార్తికేయన్‌కి చిన్నప్పటి నుంచే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. కానీ పూర్తిస్థాయి నటుడు కావడానికి ముందే ఆర్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు 2013లో పాప పుట్టింది. ఆమె పేరు ఆరాధన.

(ఇదీ చదవండి: అక్కడ సౌండ్ చేస్తే చచ్చిపోతారు.. ఓటీటీలోనే క్రేజీ మూవీ)

ఓసారి ఫ్రెండ్స్ బలవంతం చేయడంతో షోలో పాల్గొని విజేతగా నిలిచాడు. మరోవైపు యాంకర్‌గానూ పలు షోలు చేశాడు. ఇవి కాదన్నట్లు షార్ట్ ఫిల్మ్స్‌లోనూ నటించాడు. '3' సినిమాలో ధనుష్‌కి ఫ్రెండ్‌గా చేశాడు. 2013లో విడుదలైన 'కేడీ బిల్లా కిలాడీ రంగ' మూవీ హీరోగా శివ కార్తికేయన్‌కి ఇచ్చింది. అక్కడి నుంచి ఒక్కో మూవీతో తన రేంజ్ పెంచుకుంటూ వెళ్లాడు. 'డాక్టర్' మూవీతో రూ.100 కోట్ల క్లబ్‪‌లో చేరిపోయాడు. ఇదే సినిమాతో తెలుగులోనూ ఫ్యాన్స్ ఏర్పడ్డారు.

'డాక్టర్' తర్వాత అయలాన్, మహావీరుడు, డాన్ తదితర చిత్రాలతో ఎంటర్‌టైన్ చేశాడు. కానీ రీసెంట్‌గా దీపావళికి రిలీజైన 'అమరన్' మూవీతో మాత్రం తనలోని అసలు సిసలు నటుడిని అందరికీ పరిచయం చేశాడు. ఇప్పటికే రూ.100 కోట్ల కలెక్షన్స్‌కి దగ్గర్లో ఉంది. ఈ మూవీ వల్ల అప్పుడెప్పుడో పెళ్లినాటి ఫొటోలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పైన ఫోటో అదే!

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 15 సినిమాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement