విచిత్రమైన సినిమాల లిస్ట్ తీస్తే దాదాపుగా ఇంగ్లీష్ సినిమాలే ఉంటాయి. ఎందుకంటే భయపెట్టలన్నా, కవ్వించాలన్నా, గ్రాఫిక్స్‌తో మాయ చేయాలన్నా సరే వాళ్ల తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ప్రపంచం అంతమయ్యే పరిస్థితులు వస్తే భూమిపై ఏం జరగొచ్చే అనే కాన్సెప్ట్‌తో లెక్కలేనన్ని మూవీస్ వచ్చాయి. అలాంటి ఓ సినిమానే 'ద సైలెన్స్'. 2019లో రిలీజైన ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది? నిజంగా ఇది అంత బాగుందా అనేది చూద్దాం.
(ఇదీ చదవండి: ఓటీటీలోనే ది బెస్ట్... సలార్, కేజీఎఫ్‌కి బాబు లాంటి సినిమా)
కథేంటి?
ఓ పరిశోధనా బృందం.. 800 అడుగుల లోతున్న ఓ గుహని పగలగొట్టినపుడు వింత శబ్దాలు వినిపిస్తాయి. అక్కడ నుంచి 'వెస్ప్స్' అని పిలిచే కొన్ని వింత జీవులు.. సదరు సైంటిస్ట్‌లని క్రూరంగా చంపి బయటి ప్రపంచంలోకి వస్తాయి. వీటికి శబ్దం వస్తే నచ్చదు. అలాంటిది బయట ప్రపంచంలో మనుషులు చేసే శబ్దాలకు అల్లకల్లోలం అయిపోతాయి. మనుషుల్ని పీక్కుతింటుంటాయి. మరోవైపు అల్లీ ఆండ్రూస్ అనే అమ్మాయి తల్లిదండ్రులతో కలిసి జీవిస్తుంటుంది. వెస్ప్ అనే జీవులు అందరినీ చంపేస్తున్నాయని వీళ్ల కుటుంబానికి తెలుస్తుంది. దీంతో సౌండ్ చేయకుండా ఎక్కడికైనా వెళ్లి తలదాచుకోవాలని అనుకుంటారు. మరి వింత జీవుల నుంచి వీళ్ల తప్పించుకున్నారా? లేదా అనేదే మిగతా స్టోరీ.
ఎలా ఉందంటే?
తీసింది కల్పిత కథే అయినప్పటికీ 'ద సైలెన్స్' చూస్తున్నంతసేపు మనకు వణుకు పుడుతుంది. ఒకవేళ మనకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఏంటా అని భయమేస్తుంది. జస్ట్ గంటన్నర నిడివి ఉండే ఈ మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్‌ని చక్కగా చూపించారు. అలానే ఓ ప్రమాదకర పరిస్థితి వచ్చినప్పుడు కుటుంబం ఒకరికరు ఎలా అండగా నిలబడాలో చూపించారు. ప్రధాన పాత్రధారి ఫ్రెండ్ క్యారెక్టర్‌తో ఫ్రెండ్‌షిప్ విలువ కూడా చెప్పకనే చెప్పారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ జాంబీ మూవీ.. ప్యాంటు తడిచిపోవడం గ్యారంటీ!)
ప్రస్తుతం మనలో చాలామంది పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాం. అడవుల‍్ని నరికేసి ఎన్నో జీవరాశులకు నిలువనీడ లేకుండా చేస్తున్నాయి. అవి ఏం చేయలేవు కాబట్టి సరిపోయింది. ఒకవేళ అవే గనకు వికృత రూపాల్ని సంతరించుకుని మనుషులపై తిరగబడితే ఏమవుతుంది అనే కాన్సెప్ట్‌తో తీసిన మూవీ ఇది. ఎక్కడో 800 అడుగుల లోతులో వాటి మానాన అవి ఉంటే, పరిశోధనల పేరుతో వాటిని ఇబ్బంది కలిగించడంతోనే వింత జీవులు భూమ్మీదకి వస్తాయి. మనిషికి కంటిపై కునుకు లేకుండా చేస్తాయి.
ఇందులో ప్రధాన పాత్ర కుటుంబంపై ఎప్పటికప్పుడు వింత జీవులు ఎటాక్ చేస్తూనే ఉంటాయి. ప్రతిసారి వాటి నుంచి ఎలా తప్పించుకుని బయటపడ్డారనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ప్రతి నిమిషం ఉత్కంఠభరితంగా సాగే విజువల్స్, కూర్చున్న చోటు నుంచి కదలనివ్వకుండా స్టోరీ ఉన్న 'ద సైలెన్స్' మూవీ.. ఈ వీకెండ్ మీకు బెస్ట్ ఆప్షన్ అవ్వొచ్చు. ఇంకెందుకు లేటు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాపై ఓ లుక్కేసేయండి.
- చందు డొంకాన
Comments
Please login to add a commentAdd a comment