ఒకప్పుడు హీరోగా.. ఇప్పుడేమో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా! | GOAT Movie: Prashanth Poster Released On His Birthday | Sakshi
Sakshi News home page

విజయ్‌ సినిమాలో తొలిముద్దు హీరో.. ఎందుకు చేస్తున్నాడంటే?

Published Mon, Apr 8 2024 10:27 AM | Last Updated on Mon, Apr 8 2024 10:43 AM

GOAT Movie: Prashanth Poster Released on His Birthday - Sakshi

చార్మింగ్‌ స్టార్‌ ప్రశాంత్‌ 1990 ప్రాంతంలో టాప్‌ హీరోగా రాణించాడు. అప్పట్లో ఈయన నటించిన చిత్రాలన్నీ సూపర్‌హిట్‌ అయ్యాయి. ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌తో కలిసి నటించిన జీన్స్‌ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. అతడు తమిళంలో నటించిన ఎన్నో చిత్రాలు తెలుగులో అనువాదమై సక్సెసయ్యాయి. ఈయన తెలుగులోనూ తొలిముద్దు, ప్రేమశిఖరం, లాఠీ చిత్రాల్లో హీరోగా నటించారు. వియన విధేయ రామ సినిమాలో చివరిసారిగా కనిపించారు.

గోట్‌ మూవీలో కీలకపాత్ర
ప్రస్తుతం విజయ్‌ హీరోగా నటిస్తున్న ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వెంకట్‌ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభుదేవా, అజ్మల్‌, నటి మీనాక్షీ చౌదరి, స్నేహా, లైలా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఏజీఎస్‌ ఎంటర్‌టైయిన్‌మెంట్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో విజయ్‌ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇది సైన్స్‌ ఫిక్షన్‌ జానర్‌లో తెరకెక్కుతున్నట్లు సమాచారం. షూటింగ్‌ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం ప్రస్తుతం మాస్కోలో చిత్రీకరణ జరుపుకుంటోంది.

విజయ్‌ సినిమాలో ఎందుకు?
శనివారం ప్రశాంత్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర యూనిట్‌ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్‌ విడుదల చేసింది. ఈ సందర్భంగా టాప్‌ స్టార్‌గా వెలిగిన మీరు విజయ్‌ హీరోగా నటిస్తున్న చిత్రంలో నటించడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు ప్రశాంత్‌ బదులిస్తూ వెంకట్‌ప్రభు కథ చెప్పినప్పుడే ఇది మల్టీస్టారర్‌ చిత్రం అనిపించిందన్నారు. ఆయన చెప్పిన కథ అద్భుతంగా ఉండడంతో విజయ్‌, ప్రభుదేవాలతో కలిసి నటించడానికి అంగీకరించినట్లు చెప్పారు. కథలో చాలా ట్విస్టులు ఉంటాయన్నారు. చిత్రం అన్ని వర్గాల వారికి పసందైన విందుగా ఉంటుందని, విజయ్‌, ప్రభుదేవాలతో పాట తన డాన్స్‌ బాగుంటుందన్నారు.

చదవండి: అల్లు అర్జున్‌ గురించి ఈ విషయాలు తెలిస్తే.. ఎత్తిన ప్రతి వేలూ ముడుచుకోవాల్సిందే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement