నెట్ కో స్టూడియోస్ పతాకంపై జేమ్స్ కార్తీక్, ఎం.నియాజ్‌కలిసి నిర్మించిన చిత్రం సీరన్. దురై కె.మురుగన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిర్మాతల్లో ఒకరైన జేమ్స్ కార్తీక్ ప్రధాన పాత్రను పోషించగా నటి ఇనియ, సోనియా అగర్వాల్, అరుంధతి నాయర్, ఆడుగళం నరేన్, కృష్ణ కురూప్, అజిత్, సెండ్రాయన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.
అక్కడ కులమత బేధాలు లేవు
ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చైన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో ఇనియా, సోనియా అగర్వాల్, అరుంధతి యూర్, చిత్ర దర్శక నిర్మాతలతో పాటు యూనిట్ అంతా పాల్గొన్నారు. నటుడు జేమ్స్ కార్తీక్ మాట్లాడుతూ ఇప్పటికీ సమాజంలో కులమత ద్వేషాలు రగులుతునే ఉన్నాయన్నారు. తాను ఆస్ట్రేలియాలో వ్యాపారం చేస్తున్నానని అక్కడ ఎలాంటి కులమత బేధాలు లేవని చెప్పారు. చైన్నెలో ఒక ఏడాది పాటు ఉండటానికి కుటుంబ సభ్యులతో సహా ఇక్కడికి వచ్చానని, అప్పుడు తన పిల్లలను చైన్నెలోని ఒక పాఠశాలలో చేర్పించడానికి కులం పేరు అడిగారన్నారు.
డబ్బు లేని వారి పరిస్థితి ఏంటి?
అందుకు తనకు కులం పేరు చెప్పడం ఇష్టం లేదని చెప్పానన్నారు. తనకు డబ్బు ఉంది కాబట్టి తన పిల్లలను ఆ పాఠశాలలో చేర్చుకున్నారని, కానీ డబ్బు లేని వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అలాంటి కథాంశంతో కూడిన చిత్రమే సీరన్ అని తెలిపారు. ఇది కులాల గురించి చెప్పే చిత్రం కాదని, కులం వద్దని చెప్పే కథా చిత్రం అని పేర్కొన్నారు. కులమతాల తారతమ్యం లేని సమాజాన్ని కోరుకునే కథా చిత్రం సీరన్ అని చెప్పారు. చిత్రం బాగా వచ్చిందని, యూనిట్ సభ్యులందరూ ఎంతగానో సహకరించారని జేమ్స్ కార్తీక్ తెలిపారు.
చదవండి: మహాత్మ సినిమాలో మోసం, చావు అంచుల వరకు వెళ్లా, డబ్బుల్లేక.. ఏడ్చేసిన జబర్దస్త్ జీవన్
Comments
Please login to add a commentAdd a comment