సాక్షి, తిరుచానూరు (తిరుపతి జిల్లా): రాజకీయ నేతల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అంటే తనకు అభిమానమని తమిళ సినిమా స్టార్ విశాల్ తెలిపారు. లాఠీ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం తిరుపతిలోని పలు కళాశాలల్లో విద్యార్థులతో విశాల్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. తిరుç³తి ఎస్‌డీహెచ్‌ఆర్ కళాశాలలో జరిగిన కార్యక్రమానికి సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా విశాల్ పలు ఆసక్తికర విషయాలను వ్యక్తం చేశారు.
రాజకీయాల్లో ఎవరంటే ఇష్టమని అడిగిన విద్యార్థికి తనకు జగన్ అంటే అభిమానమన్నారు. కుప్పంలో వ్యాపారాలు ఉన్నాయని, అయితే అక్కడ నుంచి తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రజాసేవ చేయాలంటే రాజకీయాల్లోకే రానవసరం లేదన్నారు. సినిమాల్లో తాను సంతోషంగా ఉన్నానని తెలిపారు. మోహన్‌బాబు మాట్లాడుతూ తాను హీరోగా నటించిన ఎం.ధర్మరాజు ఎంఏ సినిమాకు విశాల్ తండ్రి నిర్మాత అని, ఆ కుటుంబంతో ఎప్పటి నుంచో ఉన్న అనుబంధంతోనే లాఠీ ప్రమోషన్ ఫంక్షన్‌కు వచ్చినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment