ఇండస్ట్రీలోకి చాలామంది హీరోలు వస్తుంటారు. కానీ వీళ్లలో హిట్ కొట్టి నిలబడేది చాలా తక్కువమంది. ఏమైనా బ్యాక్‌గ్రౌండ్ ఉండే పర్లేదు కానీ ఒకవేళ సినీ నేపథ్యం ప్లస్ హిట్లు లేకపోతే మాత్రం ఎంత త్వరగా ఫేమ్ తెచ్చుకున్నారో అంతే ఫాస్ట్‌గా కనుమరుగైపోతారు. 'షాపింగ్ మాల్' సినిమా హీరోది కూడా సరిగ్గా అలాంటి పరిస్థితే. అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. మరి ఇప్పుడేం చేస్తున్నాడు? అసలెలా ఉన్నాడనేది చూద్దాం.
తమిళనాడులోని దిండిగల్ పుట్టి పెరిగిన మహేశ్.. స్వతహాగా వాలీబాల్ ప్లేయర్. ఓ రోజు గేమ్ ఆడుతున్నప్పుడు ఇతడిని చూసిన డైరెక్టర్ వసంతబాలన్.. తన తీయబోయే సినిమాలో నటించమని కోరాడు. కానీ తనకు యాక్టింగ్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదని మహేశ్ చెప్పాడు. కానీ ఆ తర్వాత కొన్నాళ్లకు మనసు మారడంతో అదే వసంతబాలన్ తీసిన 'అంగడి తెరు' మూవీలో హీరోగా నటించాడు. దీన్నే తెలుగులో 'షాపింగ్ మాల్' పేరుతో రిలీజ్ చేయగా సూపర్ హిట్ అయింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అవార్డు విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)
'షాపింగ్ మాల్' సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మహేశ్.. ఆ తర్వాత మాత్రం కెరీర్‌ని సరిగా ప్లాన్ చేసుకోలేకపోయాడు. ఎందుకంటే తమిళంలో వరసగా మూవీస్ చేస్తూ వచ్చాడు. అలానే మలయాళ, ఫ్రెండ్, తెలుగులోనూ తలో చిత్రం చేశాడు. కానీ ఏం లాభం... ఒక్కటంటే ఒక్క మూవీ కూడా 'షాపింగ్ మాల్' మాదిరి హిట్ అవ్వలేదు. మనోడికి పేరు రాలేదు.
ఇక తన ఫ్రెండ్స్ అందరూ జీవితంలో సెటిలైపోయారు కానీ హీరోగా పలు సినిమాలు చేసిన మహేశ్ మాత్రం హిట్లు లేకపోవడంతో పూర్తిగా డీలా పడిపోయాడు. సినిమాల వల్లనో ఏమో గానీ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే ఉండిపోయాడు. ప్రస్తుతం ఇతడికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తొలుత ఇతడిని గుర్తుపట్టలేకపోయారు. కానీ ఆ తర్వాత 'షాపింగ్ మాల్' హీరో అని తెలిసి తెలుగు నెటిజన్స్ అవాక్కయ్యారు.
(ఇదీ చదవండి: 'హనుమాన్' కోసం 70-75 సినిమాలు రిజెక్ట్ చేశా: హీరో తేజ)
Comments
Please login to add a commentAdd a comment