'ఎముకలు కొరికే చలి, ముక్కులో రక్తం.. అయినా అన్నీ భరించారు' | Tamil Star Hero Vijay Movie Leo Shooting In Jammu Kashmir | Sakshi
Sakshi News home page

Vijay Movie Leo: 'బిడ్డ పుట్టినా.. తల్లి మరణించినా.. లెక్కచేయలేదు'

Published Fri, Mar 24 2023 9:59 PM | Last Updated on Fri, Mar 24 2023 10:05 PM

Tamil Star Hero Vijay Movie Leo Shooting In Jammu Kashmir - Sakshi

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న చిత్రం 'లియో'. ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష నటిస్తోంది. ఈ చిత్రానికి లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ జమ్మూ-కశ్మీర్‌ షెడ్యూల్‌ ఇటీవలే పూర్తయింది. అయితే ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించి మేకర్స్ ఓ వీడియో రిలీజ్‌ చేశారు. ఆ వీడియోలో చిత్రబృందం పడిన కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 

తెల్లవారుజామున 3 గంటలకే

జమ్మూ-కశ్మీర్‌లో ఎముకలు కొరికే చలిలో తెల్లవారుజామున 3 గంటలకే లేచి పనులు ప్రారంభించేవారమని చిత్రబృంద సభ్యులు తెలిపారు. సాయంత్రం అవ్వగానే ముక్కు నుంచి రక్తం కారేదని.. అయినా దాన్ని లెక్క చేయలేదని వివరించారు. చిత్రీకరణకు రాత్రిపూటే అనుకూలంగా ఉండేదని తెలిపారు. ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తున్నందుకు కెమెరా లెన్స్‌లు స్పష్టంగా కనిపించేవి కావని వెల్లడించారు.  ఈ షూటింగ్‌ జరుగుతుండగానే అసిస్టెంట్‌ డైరెక్టర్లలో ఒకరికి పెళ్లయింది. అయినా రెండు రోజులకే స్పాట్‌కు తిరిగొచ్చారు. మా టీమ్‌లో ఒకరికి బిడ్డ పుడితే ఇప్పటి వరకూ ఇంటికి కూడా వెళ్లలేదని తెలిపారు. అలాగే ఫోటోగ్రాఫర్ మనోజ్‌ తన తల్లిని కోల్పోయారు. ఆమె అంత్యక్రియలు ముగిసిన వెంటనే మళ్లీ వచ్చి చిత్రీకరణలో పాల్గొన్నారు.' అని చిత్రబృందంలోని సభ్యులు ఒకరు తెలిపారు. దీన్ని బట్టి సినిమాపై వారికి ఎంత ప్రేమో అర్థమవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement