Kavin Marries Longtime Girlfriend Monica, Photos Goes Viral - Sakshi
Sakshi News home page

ప్రేయసి మెడలో మూడు ముళ్లు వేసిన హీరో.. ఫోటోలు వైరల్‌

Published Sun, Aug 20 2023 1:07 PM | Last Updated on Sun, Aug 20 2023 1:12 PM

Kavin Marries Longtime Girlfriend Monica, Photos Goes Viral - Sakshi

కోలీవుడ్‌ యంగ్‌ హీరో కెవిన్‌ పెళ్లిపీటలెక్కాడు. ఇటీవలే దాదా చిత్రంతో సక్సెస్‌ను రుచి చూసిన ఈ హీరో ప్రేయసి మోనిక డేవిడ్‌ మెడలో మూడు ముళ్లు వేశాడు. ఆదివారం (ఆగస్టు 20) ఉదయం ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. నయనతార భర్త, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ సహా తదితర తారలు ఈ శుభకార్యానికి హాజరై వధూవరులను ఆశీర్వదించినట్లు తెలుస్తోంది. తన అర్ధాంగితో కలిసి దిగిన ఫోటోలను కెవిన్‌ సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన అభిమానులు మీ జంట చూడముచ్చటగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.

కాగా కెవిన్‌ 'కనా కానమ్‌ కలలాంగల్‌' సీరియల్‌లో తొలిసారి కెమెరా ముందు నటించాడు. మొదటి సీరియల్‌తోనే మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. శ్రావణన్‌ మీనాక్షి, తాయుమానవన్‌ వంటి సీరియల్స్‌తో బుల్లితెర హీరోగా మారాడు. 2017లో 'శత్రియాన్‌' చిత్రంలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేశాడు. ఆ తర్వాతి సంవత్సరమే 'నాట్పున్న ఎన్ననాను తెరియుమా' చిత్రంతో హీరోగా మారాడు. ఈ ఏడాది వచ్చిన 'దాదా'తో సూపర్‌ హిట్‌ అందుకున్నాడు.

ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. మధ్యలో తమిళ బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లోనూ పాల్గొన్నాడు కెవిన్‌. ఆ సమయంలో తోటి కంటెస్టెంట్‌ లాస్లియాతో లవ్‌లో పడ్డాడు. ఈ విషయాన్ని లాస్లియా కూడా ధృవీకరించింది. కానీ వీరి ప్రేమ ఎంతోకాలం నిలవలేదు. కొద్దికాలానికే వీరిద్దరూ బ్రేకప్‌ చెప్పుకున్నారు. కెవిన్‌ ప్రస్తుతం కొరియోగ్రాఫర్‌ సతీష్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి అనిరుధ్‌ సంగీతం అందించనున్నాడు.

చదవండి: 'విజయ్‌, సామ్‌లకు ఈ రేంజ్‌లో పారితోషికమా? అంత లేదు!'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement