Hero Simbu Hospitalised in Chennai: తమిళ హీరో శింబు ఆస్పత్రిలో చేరాడు. వైరల్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న శింబు శనివారం చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నాడు. కాగా 'వెందు తనిందదు కాడు' అనే సినిమా షూటింగ్‌లో కొన్ని వారాలపాటు బిజీగా ఉన్న శింబు జ్వరం, గొంతులో ఇన్ఫెక్షన్ రావడంతో ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం.
అయితే ఇది కరోనా కాదని, సాధారణ ఇన్‌ఫెక్షనేనని వైద్యులు స్పష్టం చేశారు. శింబు అనారోగ్యంబారిన పడ్డారని తెలిసిన అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. కాగా తమిళ స్టార్ అయిన శింబు తెలుగులో 'వల్లభ', 'మన్మధ' వంటి ప్రేమకథా చిత్రాలతో ఇక్కడిప్రేక్షకులకూ చేరువయ్యాడు. ఇటీవలే రిలీజైన ‘మానాడు’ తెలుగులో ‘ది లూప్‘ పేరుతో అనువదించారు.
Comments
Please login to add a commentAdd a comment