ట్రైనింగ్ పూర్తి.. హెయిర్ స్టైలిస్ట్‌గా మారిన హీరో! | RJ Balaji About His Movie 'Singapore Saloon' | Sakshi
Sakshi News home page

RJ Balaji: ట్రైనింగ్ పూర్తి.. హెయిర్ స్టైలిస్ట్‌గా మారిన హీరో!

Published Mon, Jan 15 2024 10:11 AM | Last Updated on Mon, Jan 15 2024 11:46 AM

RJ Balaji About His Movie Singapore Saloon - Sakshi

ఆర్‌జేగా జీవితాన్ని ప్రారంభించిన బాలాజీ ఆ తరువాత హాస్యనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసి ఆ తరువాత కథానాయకుడిగా అవతారం ఎత్తి ఆపై మెగాఫోన్‌ పట్టి సక్సెస్‌ అయ్యారు. ఈయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం సింగపూర్‌ సెలూన్‌. గోకుల్‌ దర్శకత్వంలో వేల్స్‌ ఫిలిం పతాకంపై ఐసరీ గణేష్‌ నిర్మించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించగా, సత్యరాజ్‌, లాల్‌, జీవా, దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ ముఖ్యపాత్రలు పోషించారు.

వీరితో పాటు ఒక ప్రముఖ నటుడు కీలక పాత్రను పోషించినట్లు దర్శకుడు చెప్పారు. వివేక్‌ మెర్విన్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెల 25న తెరపైకి రానుంది. సింగపూర్‌ సెలూన్‌ చిత్రం సెన్సార్‌ బోర్డు నుంచి యూ సర్టిఫికెట్‌ పొందడం విశేషం. ఈ చిత్రం తమిళనాడు విడుదల హక్కులను రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థ పొందింది.

ఈ చిత్రం చైన్నెలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు గోకుల్‌ మాట్లాడుతూ.. చదువుకుంటున్న దశలోనే హెయిర్‌ స్టైలిస్ట్‌ కావాలని ఆశపడే ఒక సాధారణ వ్యక్తి కథే ఈ సినిమా అన్నారు. సింగపూర్‌ సెలూన్‌ చిత్రం తన కెరీర్‌లో 10 కాలాల పాటు గుర్తుండిపోతుందనే నమ్మకాన్ని బాలాజీ వ్యక్తం చేశారు. ఈ చిత్రం కోసం హెయిర్‌ స్టైలిస్ట్‌గా ప్రాథమిక శిక్షణ తీసుకున్నట్లు చెప్పారు.

చదవండి:  'ధర్మం కోసం నిలబడేవాడు ఎప్పటికీ గెలుస్తాడు': ప్రశాంత్ వర్మ ట్వీట్ వైరల్!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement