ప్రేమలో పడిన నిత్యా | nithya menon love with tamil hero | Sakshi
Sakshi News home page

ప్రేమలో పడిన నిత్యా

Published Sun, Dec 29 2013 5:02 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 AM

ప్రేమలో పడిన నిత్యా

ప్రేమలో పడిన నిత్యా

 నటి నిత్యామీనన్ ప్రేమలో పడిందా? అన్న ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఈ కేరళ కుట్టి మలయాళ చిత్ర పరిశ్రమలో కంటే తమిళం, తెలుగు భాషల్లోనే మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా తెలుగులో సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తమిళంలో చేరన్ దర్శకత్వంలో జెకె ఎన్నుం నన్భనిన్ వాళ్కై చిత్రంలోను, మాలిని 22 పాళయం కోట్టై చిత్రంలోనూ నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్నాయి. మాలిని 22 పాళయం కోటై చిత్ర హీరో నవ నటుడు క్రిష్ సదార్ ప్రేమలో పడిందట. షూటింగ్ దశలో వీరి మధ్య పరిచయం చిత్రం ముగిసే సరికి ప్రణయంగా మారిందట. 
 
ఇద్దరూ షూటింగ్ సమయంలో సన్నిహితంగా మెలగడం ఒకే గదిలో గడపడం వంటి దృశ్యాలు యూనిట్ వర్గాల దృష్టిని దాటలేకపోయాయట. త్వరలోనే వీరి ప్రేమ వ్యవహారం బహిరంగం కానుందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నారుు. విశేషం ఏమిటంటే మాలిని 22 పాళయం కోటై మలయాళ చిత్రం 22 ఫేమ్ కొట్టాయం కురీమేక్. మలయాళంలో ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించిన ఆశిక్ సబు ఆ చిత్ర హీరోయిన్  రిమా కళింగళ్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు తమిళంలో నటిస్తున్న క్రిష్ సదర్, నిత్యామీనన్‌ల ప్రేమ పెళ్లికి దారితీస్తుందా అన్నది వేచి చూడాల్సిందే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement