దొంగ దొరికాడు అంటూ నిత్యామీనన్‌ పోస్ట్‌ | Nithya Menen Reacts On Rumours Of Being Harassed By Tamil Actor, Found Fake News Creator - Sakshi
Sakshi News home page

Nithya Menen Reacts On Fake News: తప్పుడు ప్రచారం చేసే దొంగ వీడే అంటూ నిత్యామీనన్‌ పోస్ట్‌

Published Wed, Sep 27 2023 9:51 AM | Last Updated on Wed, Sep 27 2023 12:26 PM

Nithya Menen Found Fake News Creator - Sakshi

సౌత్‌ ఇండియాలో నిత్యా మీనన్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పటి వరకు తను కూడా మంచి కథతో పాటు నటనకు స్కోప్‌ ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ వచ్చింది. అంతేకాకుండా వివాదాలకు కూడా దూరంగా ఉంటుంది. కానీ గత కొన్ని రోజులుగా ఆమెపై పలు వార్తలు వైరల్‌ అయ్యాయి. తమిళ సినీ ఇండస్ట్రీపై ఆమె వివాదస్పద వ్యాఖ్యలు చేశారంటూ కొన్ని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ పుకార్లు సోషల్ మీడియాలో దుమారాన్ని రేపుతున్నాయి. అయితే, నిత్య ఆ వ్యాఖ్యలు చేయలేదని తెలుస్తోంది. 

ఆ రూమర్స్‌ ఎంటి..?
'ఓ తమిళ హీరో నన్ను చాలా వేధించాడు.. షూటింగ్‌లో నన్ను ఇబ్బంది పెట్టాడు.. తమిళ ఇండస్ట్రీలో నేను చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనలేదు.' అంటూ నిత్యా మీనన్ చెప్పినట్టుగా కొన్ని తమిళ మీడియా సంస్థలు ప్రచురించాయి. అవి ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిని నిత్యా మీనన్‌ కూడా ఖండించింది. ఇది అవాస్తవం.. జర్నలిజంలోని కొన్ని వర్గాలు ఇలా దిగజారడం చాలా బాధాకరం. ఇలాంటి చెత్తపనులు ఎలా చేస్తారు. 'నేను ఇప్పటి వరకు ఎక్కడా ఇంటర్వ్యూనే ఇవ్వలేదు. ఇలాంటి తప్పుడు వార్తలు ఇవ్వకండి. దీని కంటే మెరుగ్గా ఉండండి. ఇలాంటివి పక్కన పెట్టి కాస్త మంచి పనులు చేయండి.' అని నిత్యా మీనన్ పోస్ట్ వేసింది.

దొంగ దొరికాడు అంటూ నిత్యామీనన్‌ మరోక పోస్ట్‌ చేసింది. కొన్ని సోషల్‌ మీడియా ఖాతాలను స్క్రీన్‌ షాట్‌ తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. 'మిమ్మల్ని చూస్తే సిగ్గేస్తోంది.. మనం అందరం ఈ భూమ్మీద తక్కువ సమయమే ఉంటాం. ఒకరికొకరం ఇలాంటి ఎంత పెద్ద తప్పులు  చేస్తున్నామో అనుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. నేను దీనిని ఎందుకు ఎత్తి చూపుతున్నాననంటే.. జవాబుదారీతనం మాత్రమే చెడు ప్రవర్తనను ఆపుతుంది. ఈ తప్పుడు ప్రచారం చేసిన వారు ఇప్పటికైన మారండి. ఇలాంటి వారిని అనుసరించిన వారు కూడా తప్పును తెలుసుకోండి.' అని నిత్యా మీనన్‌ చెప్పింది.

(ఇదీ చదవండి: విజయ్‌ దేవరకొండ సినిమా నుంచి శ్రీలీల ఔట్‌.. క్రేజీ హీరోయిన్‌కు ఛాన్స్‌)

ప్రస్తుతం నిత్యా మీనన్.. తన తరువాతి ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. ఒకవైపు సినిమాలతో పాటు మరోవైపు వెబ్ సిరీస్‌లు చేయడానికి కూడా నిత్యా వెనకాడడం లేదు. అందుకే ‘కుమారి శ్రీమతి’ అనే వెబ్ సిరీస్‌తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 28న ఈ సిరీస్ అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement