కాలువలో దూకిన ఆర్య | tamil hero arya swim in open bath | Sakshi
Sakshi News home page

కాలువలో దూకిన ఆర్య

Published Sun, Apr 24 2016 8:38 AM | Last Updated on Sun, Sep 3 2017 10:39 PM

కాలువలో దూకిన ఆర్య

కాలువలో దూకిన ఆర్య

చెన్నై: అసలే ఎండాకాలం.. ఎనిమిదయిందంటేనే వీపులు పగిలిపోయేలా వేడి. జుట్టు కాలిపోయి పొగలు కక్కుతుందేమో అనిపించేంతటి. ఇంత వేడి అనుభవాన్ని ఎదుర్కుంటున్నవారికి ఆ సమయంలో ఓ నీటి కొలను కనిపిస్తే ఆగుతారా.. టపీ మని అందులో దూకేయరు. మన దక్షిణాధి నటుడు, రాజారాణి చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న ఆర్యా కూడా అదే చేశాడు. హీరో ఇమేజ్ ను పక్కకు పెట్టి ఓ కాలువలో దూకి అందరితో కలిసి సరదాగా స్నానం చేశాడు.


సాధారణంగానే వర్కవుట్, బాడీ ఫిట్ నెస్ అంటే ప్రత్యేక శ్రద్ధ చూపే.. మరీ ముఖ్యంగా కచ్చితంగా సైక్లింగ్కు వెళ్లే ఆర్య తమ ప్రాంతంలోని ఓ కాలువలాంటిదాంట్లో దూకేశాడు. ఉదయాన్నే వర్కవుట్ ముగించుకొని సైక్లింక్ చేస్తూ వచ్చిన ఆర్య.. దారిలో ఉన్న ఒక పెద్ద కాలువలో తాను హీరో అనే విషయాన్ని కూడా పక్కన పెట్టి చిన్నచిన్న పిల్లలు, ఆ గ్రామస్థులతో కలిసి సరదాగా ఈతకొట్టాడు. ప్రముఖ సైక్లిస్ట్ కృతికా, ఇతర స్నేహితులతో కలిసి హాయిగా ఈత కొట్టి పొద్దుపొద్దున్నే హ్యాపీ సండే అంటూ ఓ సెల్ఫీ పెట్టేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement