పుట్టినరోజు సందర్భంగా అనుష్క తీపికబురు! | Anushka to Announce Her Marrigage on Her Birth Day | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 31 2018 7:01 PM | Last Updated on Wed, Oct 31 2018 7:08 PM

Anushka to Announce Her Marrigage on Her Birth Day - Sakshi

సాక్షి, తమిళ సినిమా : అందాల ముద్దుగుమ్మ అనుష్క గురించి ఇప్పుడో వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. స్నేహితులంతా ముద్దుగా స్వీటీ అని పిలుచుకునే అనుష్క ప్రేమ, పెళ్లి గురించి ఇప్పటికే చాలాసార్లు ప్రచారం జరిగింది. దీనికి తగ్గట్టు ఈ బ్యూటీ కూడా భాగమతి చిత్రం తరువాత ఒక్క చిత్రంలోనూ నటించలేదు. కొత్త సినిమాలేవీ ఒప్పుకోలేదు. మధ్యలో గుళ్లూ.. గోపురాలూ తిరిగి పూజలు, దోష నివారణ పరిహారాలు చేసింది. దీంతో అనుష్క పెళ్లిపై దృష్టి సారించిందనే ప్రచారం జరిగింది. 38 ఏళ్ల అనుష్క పెళ్లి గురించి ఆమె అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

‘సైజ్ జీరో’  చిత్రంలోని పాత్ర కోసం అమాంతం బరువు పెరిగిపోయిన ఈ అమ్మడు.. వెయిట్‌ను తగ్గించుకోవడానికి చాలానే కష్టపడుతోంది. యోగాలు, కసరత్తులతో ప్రయోజనం లేకపోవడంతో పూర్వ అందాల కోసం ఆస్ట్రేలియా పరిగెత్తింది. నాజూగ్గా తయారై తరువాత ఇండియాకు తిగిగొచ్చిన తర్వాత ఆమె మళ్లీ సినిమాల్లో నటిస్తారని ప్రచారం జరిగినా.. అనుష్క మాత్రం కొత్త సినిమాలేవీ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలోనే అనుష్క త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందనే కథనాలు వైరల్‌గా మారాయి. ఇందుకు కారణం లేకపోలేదు. ఇటీవల ఈ బ్యూటీ కాలివేలుకు మెట్టెలు ధరించినట్టు కనిపిస్తున్న ఒక ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. అంతేకాదు ఈ ఫొటోకు క్యాప్షన్‌ అక్కర్లేదు అంటూ కామెంట్‌ పెట్టింది. దీంతో నవంబర్‌ 7న తన పుట్టినరోజు సందర్భంగా అనుష్క తీపికబురు చెప్పబోతున్నారని, పెళ్లి గురించి ఆమె ప్రకటించే అవకాశముందని ప్రచారం ఊపందుకుంది. ఈ కథనాల్లో వాస్తవమెంతో తేలాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే..

No caption required 😍

A post shared by Anushka Shetty (@anushkashettyofficial) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement