హీరో ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదా? | Is Horoscope The Reason Behind Prabhas And Anushka Shetty Have Not Married Till Now? Deets Inside - Sakshi
Sakshi News home page

Prabhas-Anushka Marriage: ప్రభాస్ పెళ్లికి అడ్డొస్తున్న ఆ ఒక్కటి.. లేదంటే ఆ హీరోయిన్‌తో!

Published Mon, Oct 23 2023 8:00 PM | Last Updated on Tue, Oct 24 2023 9:22 AM

Prabhas Marriage With Anushka Shetty Horoscope Problem - Sakshi

డార్లింగ్ హీరో ప్రభాస్ వరసపెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. తెలుగులో ఏ హీరోకి సాధ్యం కానీ క్రేజ్ సంపాదించాడు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ తాజా పుట్టినరోజుతో 44 ఏళ్లొచ్చినా ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నాడు. పెళ్లి మాత్రం చేసుకోవట్లేదు. ఇది మాత్రమే అభిమానుల్ని టెన్షన్ పెడుతున్న విషయం. ఇప్పుడు ప్రభాస్ పెళ్లి గురించి ప్రముఖ ఇంగ్లీష్ వెబ్‌సైట్ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ రాసింది. పెళ్లికి అడ్డొస్తున్న సమస్య ఇదేనంటూ బయటపెట్టింది.

అనుష్కతో పెళ్లి?
ప్రభాస్-అనుష్క.. హిట్ అండ్ క్యూట్ జోడీ. 'బిల్లా', 'మిర్చి', 'బాహుబలి' రెండు పార్ట్స్‌లో వీళ్లిద్దరూ కలిసి నటించారు. వీళ్ల బాండింగ్ చూసిన ఫ్యాన్స్.. వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారని అన్నారు. అయితే తమ మధ్య స్నేహం తప్ప మరొకటి లేదని పలు సందర్భాల్లో వీళ్లు చెప్పారు. లేదంటే నవ్వుతూ తప్పించుకున్నారు. అయితే వీళ్లిద్దరూ 10 ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్నారని తాజాగా టైమ్స్ నౌ వెబ్‌సైట్ రాసుకొచ్చింది.

(ఇదీ చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ఆ స్టార్ సింగర్.. అమ్మాయి ఎవరంటే?)

జాతకాల సమస్య
ఇంగ్లీష్ వెబ్‌సైట్ రాసుకొచ్చిన దాని ప్రకారం.. ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకోవాలని ఒకరికొకరు మాటిచ్చుకున్నారట. ఒకవేళ కుదరకపోతే జీవితాంతం సింగిల్‌గా ఉండిపోవాలని అనుకున్నారట. అలానే జాతకాలు కలవకపోవడంతో ప్రభాస్ కుటుంబ సభ్యులు పెళ్లికి నో చెప్పారట. ప్రభాస్ తల్లి ఎక్కువగా జాతకాలు, దేవుడిని నమ్ముతారట. ఆమె చెప్పడంతోనే ప్రభాస్ మరో మాట మాట్లాడకుండా ఇన్నాళ్లు పెళ్లికి దూరంగా  ఉన్నారట. ఈ విషయాన్ని ఒకరు తమకు ఎక్స్‌క్లూజివ్‌గా చెప్పారని టైమ్స్ నౌ రాసుకొచ్చింది.

పెద్దమ్మ చెప్పేసిందిగా!
ఈ మధ్య దసరా సందర్భంగా విజయవాడ దుర్గమ్మని దర్శించుకున్న ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి.. ప్రభాస్ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే దసరాలోపు ఈ శుభకార్యం జరిగిపోతుందని ఆమె అన్నారు. ఈమె చెప్పిందే నిజమా? లేదా తాజాగా ఇంగ్లీష్ వెబ్‌సైట్‌లో వచ్చిందా నిజామా అనేది.. ప్రభాస్-అనుష్క స్పందిస్తే తప్ప క్లారిటీ రాదు.

(ఇదీ చదవండి: వాళ్లకు క్షమాపణలు చెప్పిన మెగాహీరో రామ్‌చరణ్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement