త్వరలోనే అనుష్క శెట్టి పెళ్లి? | Anushka Shetty Marriage Rumors Goes Viral Again On Social Media? - Sakshi
Sakshi News home page

Anushka Shetty: స్టార్‌ క్రికెటర్‌తో అనుష్క శెట్టి పెళ్లి?

Published Tue, Jan 30 2024 6:07 PM | Last Updated on Tue, Jan 30 2024 9:19 PM

Once Again Anushka Shetty Marriage Rumours Goes Viral On Social Media - Sakshi

సినీ ఇండస్ట్రీలో గాసిప్స్ రావడం సర్వ సాధారణం. బాలీవుడ్‌ మాత్రమే కాదు.. సౌత్‌ ఇండస్ట్రీలోనూ ఇటీవల ఎక్కువయ్యాయి. డేటింగ్, పెళ్లి, విడాకులు అంటూ సినీ తారలపై మనం తరచు వార్తలు వింటుంటాం. స్టార్‌ నటీనటుల విషయంలో ఇవీ కాస్తా ఎక్కువగానే ఉంటాయి. అయితే సినిమా ఇండస్ట్రీ అనేది కలల ప్రపంచం అని అందరికీ తెలుసు. కెరీర్‌ ప్రధానంగా సాగే ఈ రంగంలో చాలామంది వయసు పెరుగుతునప్పటికీ పెళ్లి గురించి పెద్దగా పట్టించుకోరు. అయినప్పటికీ స్టార్ హీరోయిన్ల విషయంలో తరచుగా ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి. ఇటీవల రష్మిక- విజయ్ ఎంగేజ్‌మెంట్‌ అంటూ పెద్దఎత్తున రూమర్స్‌ వచ్చాయి. అలాంటిదేమీ లేదంటూ విజయ్ టీం క్లారిటీ ఇచ్చేసింది. అయితే తాజాగా మరో టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌పై త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందన్న టాక్‌ తెగ వైరలవుతోంది. అదేంటో ఓ లుక్కేద్దాం. 

టాలీవుడ్‌ ప్రేక్షకుల గుండెల్లో స్వీటీగా తన పేరును ముద్రించుకున్న హీరోయిన్ అనుష్క. విక్రమార్కుడు నుంచి బాహుబలి దాగా తెలుగు ప్రేక్షకులను తనదైన నటనతో మెప్పించింది. అరుంధతి చిత్రంతో జేజమ్మగా అభిమానుల గుండెల్లో పేరు సంపాదించుకుంది. గతేడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రం ద్వారా పలకరించింది. నవీన్ పోలిశెట్టి నటించిన ఈ సినిమాలో డిఫరెంట్‌ రోల్‌లో కనిపించి అలరించింది. అయితే ప్రస్తుతం నాలుగు పదుల వయసు దాటినా ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. ఈ విషయంలో గతంలో చాలాసార్లు ఆమెపై రూమర్స్ కూడా వచ్చాయి. అవీ వాటిలో ఎలాంటి నిజం లేదని తెలిసిపోయింది.

తాజాగా మరోసారి స్వీటీ పెళ్లి విషయంపై చర్చ మొదలైంది. గతంలో రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌తో  రిలేషన్‌ ఉన్నారంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడేమో ఏకంగా ఓ స్టార్‌ క్రికెటర్‌తో అనుష్క పెళ్లికి సిద్ధమైనట్లు సోషల్ మీడియాలో వైరలవుతోంది. అంతే కాకుండా వీరి పెళ్లికి ఇరు వర్గాల కుటుంబసభ్యులు కూడా ఓకే చెప్పినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్న వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. 

కాగా.. గతంలో అనుష్క పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'పెళ్లిపై నాకు నమ్మకముంది. వివాహానికి నేను ఎప్పుడూ వ్యతిరేకం కాదు. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటా" అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనుష్క పెళ్లిపై మరోసారి వార్తలు రావడం టాలీవుడ్‌లో  హాట్‌ టాపిక్‌గా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement