హీరోయిన్‌ పెళ్లి అంటూ వార్తలు.. కాస్త గట్టిగానే ఇచ్చిపడేసింది! | Taapsee Pannu Responds To Marriage Rumours About His Boyfriend Mathias Boe - Sakshi
Sakshi News home page

Taapsee Pannu: ప్రియుడితో తాప్సీ పెళ్లి.. క్లారిటీ అదిరిపోయింది!

Feb 28 2024 6:53 PM | Updated on Feb 28 2024 7:31 PM

Taapsee Pannu Responds On Marriage Rumours About His Boyfriend - Sakshi

ఇటీవల పలువురు సినీ తారలు పెళ్లిబంధంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా హీరోయిన్‌ తాప్సీ పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. డెన్మార్క్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ మథియాస్‌ బో త్వరలోనే పెళ్లాడనుందని టాక్‌ వినిపిస్తోంది. అంతే కాదు ఆమె మార్చి చివరి వారంలో రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లో గ్రాండ్‌ వెడ్డింగ్ చేసుకోబోతోందని తెగ ప్రచారం జరుగుతోంది.

తనపై పెళ్లి వార్తల నేపథ్యంలో హీరోయిన్ తాప్సీ స్పందించారు. ఇలాంటి వార్తలపై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎప్పుడూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.. ఇక నుంచి భవిష్యత్తులోనూ ఎలాంటి స్పష్టత ఇవ్వనని తేల్చి చెప్పారు. తాజా కామెంట్స్‌తో తన పెళ్లిపై వస్తున్న వార్తలకు చెక్‌ పెట్టింది ముద్దుగుమ్మ. 

కాగా.. డెన్మార్క్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ మథియాస్‌ బోతో తాప్సీ గత కొన్నేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. వారి రిలేషన్‌ గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సౌత్‌ నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన తర్వాత అతడితో పరిచయం ఏర్పడిందని పేర్కొన్నారు. కాగా.. గతేడాది డిసెంబర్‌లో వచ్చిన షారుక్ మూవీ డంకీ చిత్రంలో మెరిసింది తాప్సీ. ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్‌ హిరాణీ రూపొందించారు. ప్రస్తుతం తాప్సీ ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌రుబా చిత్రంలో నటిస్తున్నారు. హసీన్‌ దిల్‌రుబాకు సీక్వెల్‌గా వస్తోన్న ఈ చిత్రానికి జయ్‌ప్రద్‌ దేశాయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో 12th ఫెయిల్ ఫేమ్ విక్రాంత్‌ మాస్సే ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement