పెళ్లి చేసుకుంటా.. ఆ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్ | Faria Abdullah Comments On Her Marriage Goes Viral | Sakshi
Sakshi News home page

Faria Abdullah: ఆ తర్వాతే పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన ఫరియా అబ్దుల్లా

Apr 28 2024 9:07 PM | Updated on Apr 28 2024 9:07 PM

Faria Abdullah Comments On Her Marriage Goes Viral

జాతిరత్నాలు చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా. ఈ మూవీతో తెలుగు ఆడియన్స్‌కు మరింత దగ్గరైంది. ప్రస్తుతం అల్లరి నరేశ్‌కు జంటగా ఆ.. ఒక్కటీ అడక్కు అనే చిత్రంలో కనిపించనుంది. మల్లి అంకం దర్శకత్వంలో ఈ సినిమాను తెరెకెక్కించారు. రాజీవ్ చిలక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా మే 3న థియేటర్లలో సందడి చేయనుంది.

ఈ సందర్భంగా చిత్రబృందం మూవీ ప్రమోషన్స్‌ షురూ చేసింది. తాజాగా హీరోయిన్ ఫరియా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. మూవీ విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. అంతేకాకుండా తాజా ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ఈ సినిమా కాన్సెప్ట్‌ కూడా పెళ్లి గురించే కావడంతో ఫరియా చేసిన కామెంట్స్ తెగ వైరలవుతున్నాయి.

ఫరియా మాట్లాడుతూ..' పెళ్లి అనేది రెండు కుటుంబాల కలయిక. ప్రస్తుతం జరుగుతున్న పెళ్లిళ్ల విషయంలో చాలా మార్పులొచ్చాయి. లైఫ్ పార్ట్‌నర్‌ను ఎంచుకునే విషయంలో  పరిస్థితులు మారిపోయాయి. ఈ సినిమాలో పెళ్లిని మ్యాట్రీమొనీ సైట్స్‌ ఎలా డీల్‌ చేస్తారో చాలా ఎంటర్‌టైనింగ్‌గా చూపించాం. ఇందులో నరేశ్‌ తన కామెడీతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తారు. నా పెళ్లి విషయంలో స్వతహగా కొన్ని ఆలోచనలున్నాయి. ప్రస్తుతం నా దృష్టంతా కెరీర్‌పైనే . నాకు 30 ఏళ్లు దాటాకే పెళ్లి గురించి ఆలోచిస్తా. అయితే నాది కచ్చితంగా ప్రేమ వివాహమే.  అంతే కాదు హీరోయిన్‌గా మాస్‌ మసాలా, కామెడీ, హారర్‌ థ్రిల్లర్స్‌ చేయాలని ఉంది. ప్రస్తుతం తెలుగులో యాక్షన్‌ సినిమాలు చేసే హీరోయిన్స్‌ తక్కువగా ఉన్నారు. నాకు ఆ ఖాళీని భర్తీ చేయాలని ఉంది.' అని అన్నారు. తన పెళ్లి గురించి ఫరియా మొత్తానికి ఓ క్లారిటీ ఇచ్చేసింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement