రాశి ఖన్నా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మనం సినిమాలో చిన్న పాత్రతో అడుగుపెట్టిన దిల్లీ భామ.. ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోల సరసన సూపర్ హిట్ సినిమాల్లో చేసింది. జోరు, సుప్రీమ్, బెంగాల్ టైగర్, హైపర్, రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు, శ్రీనివాస కల్యాణం, ప్రతి రోజు పండగే లాంటి హిట్ చిత్రాల్లో కనిపిచింది. ప్రస్తుతం టాలీవుడ్ తెలుసు కదా అనే సినిమాలో నటించనుంది. అంతే కాకుండా బాలీవుడ్‌లో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన నటించిన యోధ విడుదలకు సిద్ధమవుతోంది.
షూటింగ్‌కు కాస్తా గ్యాప్ ఇచ్చిన ముద్దుగుమ్మ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. తన కజిన్ పెళ్లి వేడుకలో పాల్గొని ఫోటోలను ఇన్‌స్టాలో పంచుకుంది. తాజాగా హల్దీ వేడుకలో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా.. రెండు రోజుల క్రితమే కజిన్ పెళ్లికి సంబంధించిన విషయాన్ని వెల్లడించింది. గత రెండు రోజులు ఎంతో ఆనందంగా గడిచాయని తెలిపింది. చాలా ఏళ్ల తర్వాత తెలిసిన వారిని చూడటం, వాళ్లతో జీవించిన క్షణాలను గుర్తు చేసుకోవడం అద్భుతంగా అనిపించిందని పేర్కొంది. నేను బాగా ఇష్టపడే చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నట్లు అనిపించిందంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. తన కుటుంబసభ్యులతో దిగిన ఫోటోలు కూడా షేర్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment