పూజలు, మొక్కులు పెళ్లి కోసమేనా..? .. అనుష్క ఆన్సర్‌ ఇదే! | Anushka Shetty Open Up About Her Marriage | Sakshi
Sakshi News home page

పూజలు, మొక్కులు పెళ్లి కోసమేనా..? .. అనుష్క ఆన్సర్‌ ఇదే!

Published Sun, Sep 17 2023 9:00 AM | Last Updated on Sun, Sep 17 2023 4:37 PM

Anushka Shetty Open Up About Her Marriage - Sakshi

తమిళసినిమా: అరుంధతి చిత్రం నటి అనుష్క ఇమేజ్‌ను ఒక్కసారిగా మార్చేసింది. ఈ సినిమా తర్వాత అనుష్క ఆమె అభిమానులు ఆమెను గ్లామర్‌ పాత్రల్లో ఊహించుకోవడం మానేశారు. దర్శక నిర్మాతలు కూడా అత్యంత ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే ఆమెను నటింపజేయడానికి ఇష్టపడ్డారు. అలా రూపొందిన చిత్రాలే భాగమతి, బాహుబలి వంటివి. అగ్ర కథానాయక వెలిగిపోతున్న సమయంలో ఆమె కెరీర్‌కు బ్రేకులు వేసిన చిత్రం సైజ్‌ జీరో అనే చెప్పాలి. ఆ చిత్రంలోని పాత్ర కోసం అనుష్క బరువు పెరగడం అనే పెద్ద సాహసమే చేశారు. ఆ తర్వాత ఎప్పటికీ ఆమె బొద్దుగానే ఉన్నారు అదే సమయంలో ముద్దుగానో కనిపించడం విశేషం.

అలా తాజాగా అనుష్క నటించిన చిత్రం మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి. ఈ చిత్రంపై అనుష్క చాలా ఆశలు పెట్టుకున్నారు. కొంచెం ఆలస్యం అయినా ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్రం తెలుగుతోపాటు తమిళంలోనూ మంచి పేరు తెచ్చుకుంది. ఆమెకిది కమ్‌ బ్యాక్‌ చిత్రం అయిందనే చెప్పాలి. ఈ సందర్భంగా నటి అనుష్క ఓ భేటీలో పేర్కొంటూ నటిగా తనకు ఇంత బ్రేక్‌ వస్తుందని ఊహించలేదన్నారు. ఆయన మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి వంటి కొత్త కాన్సెప్ట్‌తో కూడిన ఒరిజినల్‌ కథా చిత్రంలో నటించడం సంతోషంగా ఉందన్నారు.

(చదవండి: తమిళ్‌ సైమా విజేతలు వీరే.. బెస్ట్‌ హీరో, హీరోయిన్‌ ఎవరంటే?)

ఇకపై వరుసగా నటిస్తానని చెప్పారు. ఇటీవల ఎక్కువగా గుళ్లు గోపురాలు తిరగడం గురించి ప్రస్తావిస్తూ తాను చిన్నతనం నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలకు వెళ్లేదాన్ని, నటిగా బిజీగా ఉండటంతో సమయం కుదరలేదని చెప్పారు. అయితే ఇంట్లో ఇప్పటికీ సోమవారం, శుక్రవారం పూజలు నిర్వహిస్తానని చెప్పారు. ఇక ఇటీవల ఖాళీగా ఉండడంతో ఆలయాలకు వెళ్లి స్వామి దర్శనం చేసుకున్నారని పేర్కొన్నారు. పూజలు, మొక్కులు పెళ్లి కోసమేనా..? అన్న ప్రశ్నకు ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం అనుష్క ఓ మలయాళం చిత్రంలో నటించిన సిద్ధమవుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement