తమిళసినిమా: దక్షిణాది భాషా నటీమణుల్లో తనకంటూ ప్రత్యేకత కలిగిన నటి నిత్యామీనన్. ఈమె ఏ చిత్రంలో ఎలాంటి పాత్రను పోషించినా అందులో తన ముద్ర ఉండేలా చూసుకుంటారు. అలా తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తున్న నిత్యామీనన్ ఇటీవల తమిళంలో నటించిన చిత్రం తిరుచిట్రంఫలం. ధనుష్ కథా నాయకుడిగా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇందులో నిత్యామీనన్ తన నటనకుగానూ విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. ఇకపోతే నిత్యామీనన్‌ను తాజాగా మరో హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రంలో నటించే అవకాశం వరించింది.
వినోదంతో కూడిన ఫాంటసీ కథా చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రాన్ని బాస్క్ టైమ్ థియేటర్స్, పాప్టర్ మీడియా సంస్థ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇందులో వినయ్‌రాయ్, నవదీప్, ప్రతీక్ బబ్బర్, దీపక్ పరంబోల్ ముఖ్యపాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రం ద్వారా కామిని దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఆమె దర్శకుడు విష్ణువర్ధన్ శిష్యురాలు కావడం గమనార్హం. త్వరలో సెట్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి ప్రీతా జయరా మన్ చాయాగ్రహణం, కళా దర్శకత్వం బాధ్యతలను షణ్ముగరాజా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వర లో వెల్లడించనున్నట్లు నిర్మాతలు శుక్రవారం మీడియా కు విడుదల చేసిన మీడియా ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment