Samantha To Play Negative Role In Kaathu Vaakula Rendu Kadhal Movie - Sakshi
Sakshi News home page

Samantha: మరో నెగెటివ్‌ రోల్‌లో సమంత !.. ప్రేమకు అడ్డుగా

Published Sun, Jan 9 2022 9:16 PM | Last Updated on Mon, Jan 10 2022 8:54 AM

Samantha Negative Role In Kaathu Vaakula Rendu Kadhal Movie - Sakshi

Samantha Negative Role In Kaathu Vaakula Rendu Kadhal Movie: స్టార్‌ హీరోయిన్‌ సమంత అందం, అభినయంతో సినీ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. 'ఫ్యామిలీ మ్యాన్‌ 2' హిందీ వెబ్‌ సిరీస్‌కు ముందు గ్లామర్‌ పాత్రలతో అలరించిన సామ్‌ ఈ సిరీస్‌తో తన నటనేంటో నిరూపించింది. ఈ సిరీస్‌తో జాతీయ స్థాయిలో వినపడిన సమంత పేరు ఇంటర్నేషనల్‌ రేంజ్‌కు పాకింది. ఇక నుంచి తాను నటనకు ప్రాధాన్యమున్న ఛాలేంజింగ్‌ రోల్స్‌ చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. అందుకు తగినట్లుగానే పాత్రలను సెలెక్ట్ చేసుకుంటుంది సామ్‌. హాలీవుడ్‌ మూవీ 'అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌' సినిమాలో తాను బై-సెక్సువల్‌ యువతి పాత్ర పోషిస్తున్న విషయాన్ని తానే ప్రకటించింది. 



ఇదీ చదవండి: ఏం చేయగలను.. వారిని ఇంతవరకూ చూడలేదు: సమంత

అయితే తాజాగా తాను మరో ఛాలేంజింగ్‌ పాత్ర చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సమంత మరో నెగెటివ్‌ పాత్రలో అలరించనుందట. తమిళ స్టార్‌ హీరో విజయ్ సేతుపతి, అందాల అభినయం నయన తారతో కలిసి సమంత నటిస్తున్న చిత్రం 'కాత్తువాక్కుల రెండు కాదల్‌'. ఇందులో నయన తారకు సమానమైన పాత్రలో సామ్‌ నటించనుందట. విఘ్నేష్‌ శివన్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ సినిమాలో ఊహించని రీతిలో 'ఖతిజా'గా సామ్‌ నెగెటివ్ షేడ్స్‌లో ఆకట్టుకోనుందని సమాచారం. ఈ పాత్రలో సమంత యాక్టింగ్‌ సూపర్‌గా ఉందని కోలీవుడ్‌ సినీ వర్గాలు గుసగుసలాడుతున్నాయట. విజయ్ సేతుపతి, నయన తార ప్రేమాయణానికి అడ్డుపడి సమంత తన విలనిజంతో కథను మలుపు తిప్పనుందట. అయితే ఈ వార్తల్లో ఎంతవరకూ నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే ఇప్పటికే 'ఫ్యామిలీ మ్యాన్‌ 2'లో రాజీగా ఆకట్టుకున్న సామ్‌ ఈ సినిమాలో ఎలాంటి విలనిజం చూపెట్టనుందో వేచి చూడాలి. 



ఇదీ చదవండి: 'ఊ అంటావా' సాంగ్‌ పూర్తి వీడియో వచ్చేసింది.. చూశారా !

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement