తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు బుధవారం పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో హల్చల్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలకు విరుద్ధంగా రజనీకాంత్ ఫొటోలతో కూడిన టీ షర్టులు ధరించి వచ్చారు.
తిరుమల: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు బుధవారం పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో హల్చల్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలకు విరుద్ధంగా రజనీకాంత్ ఫొటోలతో కూడిన టీ షర్టులు ధరించి వచ్చారు. అభిమానులు రజనీ బ్యానర్లతో నడక దారి గుండా తిరుమలకు చేరుకున్నారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు ఎవరూ ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీసింది. రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కోచడయాన్ విజయవంతం కావాలని కాంక్షిస్తూ అభిమానులు తిరుమల యాత్రకు వచ్చారు.