ప్రముఖ దర్శకుడిపై జూనియర్‌ నటి తీవ్ర ఆరోపణలు | Junior artist accuses director Atlee | Sakshi
Sakshi News home page

ప్రముఖ దర్శకుడిపై జూనియర్‌ నటి తీవ్ర ఆరోపణలు

Published Tue, Apr 23 2019 7:28 PM | Last Updated on Tue, Apr 23 2019 7:30 PM

Junior artist accuses director Atlee - Sakshi

సాక్షి, చెన్నై : కోలివుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు అట్లీపై ఒక జూనియర్‌ నటి సంచలన ఆరోపణలు చేశారు. దళపతి విజయ్‌ 63వ సినిమాను అట్లీ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ సందర్భంగా దర్శకుడు అట్లీ తనను దారుణంగా దూషించారని, అసభ్యంగా, అశ్లీలంగా ఆయన దూషణలు ఉన్నాయని ఆమె తాజాగా చెన్నై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అట్లీ తనను కుక్క కంటే హీనంగా చూసేవాడని ఆమె విమర్శించారు. రాజా-రాణి, తెరి, మెర్సల్‌ లాంటి విజయవంతమైన సినిమాలతో ప్రముఖ దర్శకుడిగా పేరొందిన అట్లీపై ఈరకమైన ఆరోపణలు రావడం తమిళ చిత్రసీమలో సంచలనం రేపుతోంది.

ఏప్రిల్‌ 13న షూటింగ్‌ సెట్‌లో తనను అట్లీ ఘోరంగా దూషించాడని, అయినా ఎన్నికలు ఉండటం, ప్రభుత్వ సెలవులు ఉండటంతో ఈ విషయాన్ని ఇప్పటివరకు వెల్లడించలేదని ఆమె చెప్పుకొచ్చారు. ‘ఆహారం, సరైన టాయ్‌లెట్లు కావాలని మాత్రమే మేం సహాయ దర్శకులను అడిగేవాళ్లం. కానీ, అట్లీ, అతని సహాయ దర్శకులు మా విజ్ఞప్తిని పట్టించుకోకపోగా, మమ్మల్ని దూషించారు. అంతేకాదు, నన్ను షూటింగ్‌ స్పాట్‌ నుంచి బలవంతంగా తరిమేశారు’ అని ఆమె పేర్కొన్నారు. ఫుట్‌బాల్‌ నేపథ్యంతో తెరకెక్కుతున్న అట్లీ తాజా సినిమాలో విజయ్‌ సరసన నయనతార నటిస్తుండగా.. జాకీ ష్రఫ్‌, కదిర్‌ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement