Director Atlee
-
సల్మాన్ ని చూసి బన్నీని పక్కన పెట్టిన అట్లీ..
-
ఆగిపోయిన అల్లు అర్జున్, అట్లీ మూవీ !
-
అట్లీతో అల్లు అర్జున్ న్యూ మూవీ..
-
జవాన్ డైరెక్టర్ గట్టిగా తిట్టేసరికి ఏడ్చేసాను..
-
ఆలస్యంగా వస్తున్న జవాన్
షారుక్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జవాన్’. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించగా, ప్రధాన పాత్రలో విజయ్ సేతుపతి, కీలక పాత్రల్లో సంజయ్ దత్, దీపికా పదుకోన్ నటించారు. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ ‘జవాన్’ సినిమాను షారుక్ భార్య గౌరీ ఖాన్ నిర్మించారు. కాగా ఈ సినిమాను తొలుత జూన్ 2న విడుదల చేయాలనుకున్నారు. కానీ సెప్టెంబరు 7న రిలీజ్ చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్స్ పెండింగ్ ఉండటం ‘జవాన్’ రిలీజ్ వాయిదా పడటానికి ముఖ్య కారణమని బాలీవుడ్ సమాచారం. -
పెళ్లయిన 8 ఏళ్ల తర్వాత.. తండ్రి కాబోతున్న స్టార్ డైరెక్టర్
ప్రముఖ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయన భార్య, నటి ప్రియ మోహన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను షేర్చేస్తూ.. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ప్రెగ్నెంట్. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు కావాలి అంటూ ఇన్‌స్టాలో పోస్టును షేర్ చేసింది. ఇది చూసిన పలువురు సెలబ్రిటీలు సహా నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్న అట్లీ- ప్రియలు 2014లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లయిన 8 ఏళ్ల తర్వాత అట్లీ దంపతులు పేరెంట్స్‌గా ప్రమోట్ కాబోతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. నయనతార, నాజ్రియా, ఆర్య ప్రధాన పాత్రల్లో నటించిన రాజారాణి సినిమాతో స్టార్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్నారు అట్లీ. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం షారుక్ ఖాన్‌తో 'జవాన్' సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తైన తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమాను తెరకెక్కించే అవకాశం ఉంది. View this post on Instagram A post shared by Priya Mohan (@priyaatlee) -
చాలా ఇష్టమైన వ్యక్తిని కోల్పోయా : డైరెక్టర్ అట్లీ
చెన్నై : ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. అట్లీ తాతయ్య సౌందరా పాండియన్ కన్నుమూశారు. ఈ విషయాన్ని స్వయంగా అట్లీ తన ట్విట్టర్ ద్వారా పేర్కొంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఆయనతో దిగిన ఓ ఫోటోను షేర్ చేస్తూ..మా కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. మా తాత ఎం. సౌందరా పాడియన్ చనిపోయారు. పూడ్చలేని నష్టమిది..దీన్ని ఎలా అధిగమించాలో తెలియడం లేదు. ఆయన నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి. నేను ఆయన్ని ఎంతగానో ప్రేమిస్తాను. తాత మీరే నా రోల్‌మోడల్, లవ్ యూ, మిస్ యూ..మీ ఆత్మకు శాంతి కలగాలి అంటూ అట్లీ ట్వీట్ చేశారు. ఇది చూసిన పలువురు ప్రముఖులు సహా అభిమానులు అట్లీక కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక తొలిచిత్రం రాజా రాణితో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అట్లీ ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించారు. టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ తమిళ ఇండస్ర్టీలో మోస్ట్ కమర్షియల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం అట్లీ బాలీవుడ్లో షారుక్ ఖాన్‌తో ఓ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. తెలుగులోనూ జూనియర్ ఎన్టీఆర్‌తో ఓ పాన్ ఇండియా మూవీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తారక్‌కు స్క్రిప్ట్ వినిపించారని, త్వరలోనే ఈ మూవీ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది. My periyappa late justice M.Sowndra Pandian has passed away,Banyan of the whole family,Completely Devastated painful can’t take it & don’t know how to com over it,Love him the most,Periyappa ur always our king & role model, Love u & Will miss u , rest in peace... pic.twitter.com/LTvFXFQ9on — atlee (@Atlee_dir) April 25, 2021 చదవండి : 'ఆ ఫోటోలు పెడుతున్నారు..కొంచెం అయినా సిగ్గుండాలి' ఆస్కార్ 2021: దక్షిణ కొరియాకు తొలి ఆస్కార్ నటి -
హీరో విజయ్ ఫ్యాన్స్ అరెస్ట్
అభిమానం హద్దు మీరింది. బిగిల్ చిత్రం విడుదల సందర్భంగా విజయ్ అభిమానులు విధ్వంసానికి దిగారు. ముందుగా సినిమా ప్రదర్శించలేదని థియేటర్లోని ఫర్నీచర్ ధ్వంసం చేశారు. సీసీ టీవీలను పగులకొట్టారు. దీంతో వారిని అదుపు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: విజయ్ హీరోగా నటించిన బిగిల్ చిత్రం విడుదల విధ్వంసానికి, లాఠీ చార్జ్‌కి దారితీసింది. విజయ్ అభిమానుల ఆగ్రహానికి అంగళ్లతోపాటూ పోలీసు వాహనం కూడా అగ్నికి ఆహుతైంది. నలుగురు పోలీసులు గాయపడగా, పలువురు అభిమానులు కటకటాల పాలయ్యారు. తమిళ సినీ పరిశ్రమలో రజనీకాంత్ తరువాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్లుగా ప్రచారంలో ఉన్న హీరో విజయ్. ఆయన సినిమా అంటే అభిమానులకు పండుగే. శుక్రవారం విజయ్ చిత్రం విడుదల కావడంతో అభిమానుల్లో ఆనందం కట్టలుతెంచుకుంది. దర్శకుడు అట్లీ, విజయ్, నయనతార కాంబినేషన్ కావడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ చిత్రం ప్రత్యేక ప్రదర్శన కోసం అభిమానులు దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం నిరాకరించింది. దీంతో అభిమానులు ఆగ్రహంతో రగిలిపోయారు. అయితే గురువారం రాత్రి ప్రభుత్వం అకస్మాత్తుగా తొలిరోజు మాత్రం ప్రత్యేక ప్రదర్శనకు అనుమతి ఇవ్వడంతో ఒకింత శాంతించారు. శుక్రవారం తెల్లవారుజామున రాష్ట్రవ్యాప్తంగా అన్ని థియేటర్లలో ప్రత్యేక షో ప్రదర్శితమైంది. కృష్ణగిరిలో రెండు థియేటర్లలో బిగిల్ ప్రదర్శనకు సిద్ధంకాగా, అభిమానుల కోసం శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు ప్రత్యేక ప్రదర్శన ఉంటుందని యాజమాన్యం ప్రకటించింది. దీంతో గురువారం అర్ధరాత్రి నుంచే పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకోవడం ప్రారంభించారు. క్రమేణా ఈ సంఖ్య మరింత పెరిగిపోవడంతో తోపులాట, తొక్కిసలాట మొదలైంది. వెంటనే షో వేయాలని అభిమానులు కేకలు వేశారు. అయితే 3 గంటల తరువాత మాత్రమే ప్రత్యేక ప్రదర్శన వేయాలని ప్రభుత్వ ఆదేశాలున్నాయని యాజమాన్యం వారికి తెలిపింది. దీంతో అసహనానికి లోనైన అభిమానులు విధ్వంస చర్యలు ప్రారంభించారు. థియేటర్లోకి జొరబడి కుర్చీలను ధ్వంసం చేశారు. రోడ్డు పక్కన ఉన్న అంగళ్లను, ప్రకటన బోర్డులను తగులబెట్టారు. థియేటర్‌కు అమర్చి ఉన్న సీసీటీవీ కెమెరాలను పగులగొట్టారు. అప్పటికే గస్తీ విధుల్లో ఉన్న పోలీసులు అభిమానులను చెదరగొట్టడం ప్రారంభించగా గందరగోళం నెలకొంది. పోలీసులపై అభిమానులు దాడికి దిగారు. పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. అభిమానుల దాడులు అదుపు తప్పడంతో పోలీసులు కంట్రోలు రూముకు ఫోన్ చేయడంతో ప్రత్యేక పోలీసు దళం రంగప్రవేశం చేసి లాఠీచార్జ్‌కి దిగారు. ఈ గొడవల్లో నలుగురు పోలీసులకు, కొందరు అభిమానులకు గాయాలయ్యాయి. పోలీసుల అదుపులో 37 మంది.. ఆస్తులను ధ్వంసం చేసిన వారిలో 37 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణగిరిలోని రెండు థియేటర్ల ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి శుక్రవారం తెల్లవారుజాము 5 గంటలకు అభిమానుల కోసం ప్రత్యేక షో వేశారు. ఇదిలా ఉండగా, శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వందలాది థియేటర్లలో యధావిధిగా విడులైంది. విజయ్ ఫ్లెక్సీలకు అభిమానులు పాలాభిషేకం చేశారు. నకిలీ టోకెన్లు.. ప్రత్యేక షో చూసేందుకు నకిలీ టోకెన్లతో వచ్చిన ముగ్గురు అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తూత్తుకూడిలో రెండు థియేటర్లలో బిగిల్ విడుదలైంది. విజయ్ అభిమానుల కోసం ప్రత్యేక ప్రదర్శన కోసం ఏర్పాట్లు జరిగాయి. ఇందుకోసం నగదు మొత్తాన్ని యాజమాన్యానికి చెల్లించారు. ఆ తరువాత తొలి ప్రదర్శనకు టిక్కెట్ల పంపిణీకై టోకన్లను పంపిణీ చేశారు. అయితే కొందరు అభిమాలను చేతుల్లోని టోకన్లపై అభిమాన సంఘం నేతలకు అనుమానం రావడంతో తనిఖీ చేయగా అవి నకిలీ టోకన్లని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో రాజన్ (28), మోహన్‌బాబు (26), ఆనంద్ (30)లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నకిలీ టోకన్లను ముద్రించిన తిరునెల్వేలీకి చెందిన ఒక వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా కోర్టులు, కేసులు, ఆరోపణలు, వ్యతిరేకతలను అధిగమించి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన బిగిల్ చిత్రం తెలుగులో ‘విజిల్’ గా విడుదలైంది. నయనతార హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేశాడు. మరోవైపు సినిమా పాజిటిల్ టాక్ సొంతం చేసుకుంది. విజయ్ మాస్ పాత్రలో ఇరగదీశాడంటూ, సెకండ్ హాఫ్‌లో సెంటిమెంట్ ద్వారా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కనెక్ట్ అయ్యాడంటూ అభిమానులు ట్విట్ చేస్తున్నారు. -
ప్రముఖ దర్శకుడిపై జూనియర్ నటి తీవ్ర ఆరోపణలు
సాక్షి, చెన్నై : కోలివుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు అట్లీపై ఒక జూనియర్ నటి సంచలన ఆరోపణలు చేశారు. దళపతి విజయ్ 63వ సినిమాను అట్లీ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా దర్శకుడు అట్లీ తనను దారుణంగా దూషించారని, అసభ్యంగా, అశ్లీలంగా ఆయన దూషణలు ఉన్నాయని ఆమె తాజాగా చెన్నై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అట్లీ తనను కుక్క కంటే హీనంగా చూసేవాడని ఆమె విమర్శించారు. రాజా-రాణి, తెరి, మెర్సల్ లాంటి విజయవంతమైన సినిమాలతో ప్రముఖ దర్శకుడిగా పేరొందిన అట్లీపై ఈరకమైన ఆరోపణలు రావడం తమిళ చిత్రసీమలో సంచలనం రేపుతోంది. ఏప్రిల్ 13న షూటింగ్ సెట్లో తనను అట్లీ ఘోరంగా దూషించాడని, అయినా ఎన్నికలు ఉండటం, ప్రభుత్వ సెలవులు ఉండటంతో ఈ విషయాన్ని ఇప్పటివరకు వెల్లడించలేదని ఆమె చెప్పుకొచ్చారు. ‘ఆహారం, సరైన టాయ్లెట్లు కావాలని మాత్రమే మేం సహాయ దర్శకులను అడిగేవాళ్లం. కానీ, అట్లీ, అతని సహాయ దర్శకులు మా విజ్ఞప్తిని పట్టించుకోకపోగా, మమ్మల్ని దూషించారు. అంతేకాదు, నన్ను షూటింగ్ స్పాట్ నుంచి బలవంతంగా తరిమేశారు’ అని ఆమె పేర్కొన్నారు. ఫుట్‌బాల్ నేపథ్యంతో తెరకెక్కుతున్న అట్లీ తాజా సినిమాలో విజయ్ సరసన నయనతార నటిస్తుండగా.. జాకీ ష్రఫ్, కదిర్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. -
దెయ్యం అంటే చాలా భయమంటా..
కోలీవుడ్‌లో కొంత కాలంగా హారర్ కథల ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. తమిళంలో విడుదల అవుతున్న ఎలాంటి హారర్ చిత్రం అయినా సరే విజయం సాధిస్తుండడం విశేషం. ఈ వరుసలో తాజాగా మరో హారర్ చిత్రం తెరపైకి రానుంది. బాక్స్ స్టార్ స్టూడియోస్, అట్లి ఏ ఫార్ ఆపిల్ సంస్థలు సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘సంగిలి బుంగిలి కదవ తొర‘. జీవా, శ్రీదివ్య, సూరి నటిస్తుండగా, కమల్‌హాసన్ సహాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఐక్ కొత్త దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విశాల్ చంద్రశేఖరన్ సంగీతంలో శింబు, అనిరుద్, జీవీ ప్రకాష్, గంగై అమరన్, ప్రేమ్‌జీ వంటి ఐదుగురు సంగీత దర్శకులు పాటలు పాడారు. ఈ చిత్ర ఆడియో ఇటీవల సత్యం థియేటర్లో విడుదల చేశారు. విభిన్న హారర్, కామెడీ కథాంశంతో రూపొందిన ఈ చిత్ర ఆడియోను కమల్‌హాసన్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అట్లీ మాట్లాడుతూ.. ఇదే సత్యం థియేటర్లో తన తొలి చిత్రం ‘రాజారాణి’ ఆడియో విడుదల జరిగిందన్నారు. రూపాన్ని చూసి ‘ఎవరినీ వీడేమి చేస్తాడులే..’ అని ఊహించరాదన్నారు. ఆ విధంగా తలచకుండా ఆర్.మురుగదాస్ సార్ అవకాశం ఇచ్చినందువల్లే ఇప్పుడు దర్శకుడిగా ఇక్కడ నిలుచోని ఉన్నట్టు తెలిపారు. చాలా కథలు విని, వాటిలో నుంచే ఈ ‘సంగిలి బుంగిలి కదవ తొర’ చిత్రాన్ని ఎంపిక చేసుకున్నట్లు చెప్పారు. తనకు దెయ్యం అంటే చాలా భయమని, అందువల్లనే ఇటువంటి దెయ్యం చిత్రాన్ని ఎంపిక చేసుకున్నట్టు చిత్ర నిర్మాత, దర్శకుడు అట్లి అన్నారు. -
తెరి దర్శకుడితో కార్తీ?
తెరి చిత్ర దర్శకుడితో కలిసి పనిచేయడానికి నటుడు కార్తీ రెడీ అవుతున్నారా? దీనికి కోలీవుడ్ వర్గాల నుంచి అలాంటి అవకాశం లేకపోలేదనే సమాధానం వస్తోంది. తొలి చిత్రం రాజారాణితోనే తమిళ చిత్ర పరిశ్రమ దృష్టిని తనవైపు తిప్పుకున్న దర్శకుడు అట్లీ. శంకర్ శిష్యుడైన ఈయన తన రెండో చిత్రంతోనే విజయ్ వంటి స్టార్ హీరోతో పనిచేసి ఆయనకు అద్భుత విజయాన్ని అందించి తనూ క్రేజీ దర్శకుడిగా ఎదిగారు. ఆ చిత్రమే తెరి. కాగా ఆ చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తున్న దర్శకుడు అట్లీ తాజా చిత్రానికి సిద్ధం అవుతున్నారు. తన తాజా చిత్ర వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని తెరి సక్సెస్ మీట్లో చెప్పారు. అందుకు సమయం ఆసన్నమైనట్లు సమాచారం. యువ నటుడు కార్తీని తన తాజా చిత్రానికి కథానాయకుడిగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ నిర్మించనున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్ర నిర్మాణం ప్రస్తుతం చర్చల్లోనే ఉన్నట్లు తెలిసింది. కార్తీ ప్రస్తుతం కాష్మోరా చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. గోకుల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార, శ్రీదివ్య కథానాయికలుగా నటిస్తున్నారు. తదుపరి మణిరత్నం దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ అతిథిరావు నాయకిగా నటించనున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఆ తరువాత అట్లీ దర్శకత్వంలో నటించే చిత్రం ఉండే అవకాశం ఉంది. -
నైనిక... నీకు తిరుగు లేదిక!
బాల తారగా, కథానాయికగా వెండితెరపై మీనా తిరుగు లేదనిపించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తల్లికి తగ్గ తనయ అనిపించుకోబోతోంది బేబి నైనిక... డాటరాఫ్ మీనా. విజయ్ హీరోగా రూపొందిన ‘తెరి’ (తెలుగులో ‘పోలీసోడు’) చిత్రంతో నైనిక బాల నటిగా అడుగుపెట్టింది. చిన్నప్పుడు మీనా లానే ఇప్పుడు నైనిక కూడా అందంగా ఉంది. తల్లి నోట్లో నుంచి ఊడిపడిందని చూసినవాళ్లు అంటు న్నారు. చూపులకే కాదు, నటనలో కూడా తల్లిలానే నైనిక చాలా ట్యాలెంటెడ్ అని ‘తెరి’ యూనిట్ అంటోంది. విజయ్‌కి దీటుగా నైనిక నటించిందని చిత్ర దర్శకుడు అట్లీ కితాబులిచ్చేశారు. ‘తెరి’ప్రెస్మీట్లో పాల్గొన్న నైనిక... ‘విజయ్ అంకుల్, అట్లీ అంకుల్’ అంటూ యూనిట్ సభ్యులందర్నీ వరసలు కలిపి ధన్య వాదాలు చెప్పి, అందరి మనసులనూ ఆకట్టుకుంది. ఇంతకీ, ‘మీ అమ్మాయి పెద్దయ్యాక హీరోయిన్ అవు తుందా?’ అని మీనాను అడిగితే, ‘‘ఆ సంగతి ఇప్పుడే చెప్పలేను. నైనిక నటిస్తానంటే నేనొద్దనను. నటించనంటే బల వంతం చేయను. ఇప్పటికైతే చదువు మీదే దృష్టి’’ అన్నారు. మొత్తానికి, తల్లికి తగ్గట్లే కూతురు కూడా పేరు తెచ్చుకొనే రోజు ఎంతో దూరంలో లేదు. -
సంప్రదాయ రీతిలో అట్లి పెళ్లి
వర్ధమాన దర్శకుడు అట్లి, నటి ప్రియల వివాహం ఆదివారం ఉదయం సంప్రదాయ రీతిలో జరిగింది. దర్శకుడు శంకర్ శిష్యుడైన అట్లి రాజా రాణి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. తొలి చిత్రంతోనే విజయం సాధించి చిత్ర పరిశ్రమను తన వైపు తిప్పుకున్న అట్లి తన రెండో చిత్రాన్ని ఇళయదళపతి విజయ్ హీరోగా చేయనున్నారు. చాలాకాలంగా బుల్లితెర, వెండితెర నటి ప్రియ, అట్లి ప్రేమించుకుంటున్నారు. ఈ ప్రేమ జంట ఆదివారం పెళ్లిపీటలె క్కింది. స్థానిక అన్నాశాలైలోని నక్షత్ర హోటల్లో వీరి వివాహం ఘనంగా జరిగింది. దర్శకుడు శంకర్ సతీసమేతంగా విచ్చేసి ఆహుతులకు ఏర్పాటు చేసిన పెళ్లి వేదిక స్థలంలో ముందు వరసలో కూర్చొని పెళ్లి వేడుకను ఆద్యంతం తిలకించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు మధ్య తన చేతులతో మంగళసూత్రాలను తన శిష్యుడు అట్లీకి అందించగా ఆయన వధువు ప్రియ మెడలో మాంగల్య ధారణ చేశారు. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబాల బంధుమిత్రులతోపాటు దర్శకుడు బాలా, నటుడు శివకార్తికేయన్, నాజర్ తదితర పలువురు సినీ ప్రముఖులు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. సాయంత్రం జరిగిన వివాహ రిసెప్షన్‌కు పలువురు చిత్ర ప్రముఖులు తరలి వచ్చి శుభాకాంక్షలు అందించారు. -
మా పెళ్లికి రండి
మా పెళ్లికి రండి అంటూ యువ దర్శకుడు అట్లి, ప్రియ చిత్ర ప్రముఖులను ఆహ్వానించారు. ప్రముఖ దర్శకుడు శంకర్ వద్ద శిష్యరికం చేసిన అట్లి రాజారాణి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన విషయం తెలిసిందే. తొలి చిత్రంతోనే విజయాన్ని సొంతం చేసుకున్న ఈ యువ దర్శకుడు తొలి చూపులోనే ప్రేమించిన ప్రేయసి ప్రియను జీవిత భాగస్వామిగా చేసుకోనున్నారు. ప్రియ అనే కృష్ణప్రియ కూడా నటినే. జోడి నెంబర్ 1 అనే టీవీ షోలో పాపులర్ అయిన ఈమె బుల్లితెర నటిగా ప్రాచుర్యం పొందారు. వీరి ప్రేమకు పెద్దలు పచ్చజెండా ఊపడంతో పెళ్లికి సిద్ధం అయ్యారు. ఆదివారం ఉదయం స్థానిక అన్నాశాలై రోడ్డులోని హయత్ హోటల్లో వీరి వివాహం జరగనుంది. సాయంత్రం అదే వేదికపై వివాహ రిసెప్షన్ జరగనుంది. దర్శకుడు అట్లి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తన జీవితంలో అతి ముఖ్యమైన తరుణం దర్శకుడు శంకర్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేయడం అన్నారు. రెండో ముఖ్యమైన ఘట్టం రాజారాణి చిత్రంతో దర్శకుడిగా పరిచయం కావడమని పేర్కొన్నారు. ఇక మూడో ముఖ్యమైన ఘట్టం ప్రియతో పెళ్లి అని అన్నారు. ప్రియ తనకు నచ్చిన అమ్మాయి మాత్రమే కాదని తనను అర్థం చేసుకున్న మనసుకు దగ్గరైన ఆత్మీయురాలని అట్లీ పేర్కొన్నారు. మనసున్న మనిషి అట్లికి అర్ధాంగి కానుండడం సంతోషంగా ఉందని ప్రియ పేర్కొన్నారు.